Realme 15T 5G Phone First sale price under 25000 on Flipkart
Realme 15T స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయటానికి రియల్ మీ డేట్ మరియు టైం అనౌన్స్ చేసింది. కేవలం ఇది మాత్రమే కాదు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్లు మరియు అంచనా ధర వివరాలు కూడా రియల్ మీ ముందే అందించింది. రియల్ మీ లాంచ్ చేయబోతున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టాప్ ఫీచర్లు మరియు ప్రైస్ వివరాలు ఏమిటో చూద్దామా.
రియల్ మీ 15t స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తున్నట్లు రియల్ మీ వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం కంపెనీ అందించిన టీజర్ పేజీ ద్వారా ఈ ఫోన్ యొక్క కీలకమైన వివరాలు మరియు డీటెయిల్స్ అందించింది. దీని ద్వారా, ఈ అప్ కమింగ్ రియల్ మీ స్మార్ట్ ఫోన్ 7.79mm మందంతో చాలా స్లిమ్ డిజైన్ మరియు 181 గ్రాముల బరువుతో చాలా లైట్ వైట్ తో లాంచ్ అవుతున్నట్లు తెలిపింది.
ఈ ఫోన్ చాలా స్లిమ్ డిజైన్ తో ఉన్నా కూడా 7000mAh టైటాన్ బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. సన్నని డిజైన్ మరియు తక్కువ బరువులో అతి పెద్ద బ్యాటరీ కలిగిన ఫోన్ గా రియల్ మీ 15టి ని ఇండియన్ మార్కెట్ కి పరిచయం చేస్తున్నట్లు రియల్ మీ ఈ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ లేటెస్ట్ మైక్రో టెక్స్చర్ మాట్టే ఫినిష్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ చూడటానికి అందమైన డిజైన్ తో ఆకట్టుకునేలా ఉంది.
ఇక మెయిన్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ మీడియా టెక్ Dimensity 6400 Max చిప్ సెట్ తో లాంచ్ చేస్తుంది. ఇది మీడియాటెక్ కొత్తగా అందించిన లేటెస్ట్ 5G చిప్ సెట్ మరియు మల్టీ టాస్కింగ్ కోసం గొప్పగా ఉంటుంది. ఇదే కాదు ఈ ఫోన్ IP69 రేటింగ్ తో ఈ ఫోన్ గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.
ఇక ఈ ఫోన్ కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక 50MP AI ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు కూడా 50MP సెల్ఫీ కెమెరా సెటప్ అందించింది. ఈ ఫోన్ AI Edit Gene వంటి Ai కెమెరా ఫీచర్లు మరియు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6.57 ఇంచ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ చాలా సన్నని అంచులు కలిగి ఉండడమే కాకుండా ఇది 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Digital Ration Card వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలుసా.!
రియల్ మీ ఈ ఫోన్ ను అండర్ రూ. 20,000 ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. అంటే, ఈ ఫోన్ రూ. 19,999 రూపాయలు లేదా అంత కంటే తక్కువ ధరలో లాంచ్ అవుతుంది.