Realme 15 Pro game of thrones Limited Edition launching in India
రియల్ మీ 15 సిరీస్ నుంచి ఇప్పటికే నాలుగు స్మార్ట్ ఫోన్లు విడుదల చేసిన కంపెనీ ఇప్పుడు ఆల్ న్యూ డిజైన్ తో Realme 15 Pro GoT Limited Edition స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క డిజైన్ మరియు ఫీచర్లతో కంపెనీ కొత్తగా టీజింగ్ మొదలుపెట్టింది. రియల్ మీ 15 సిరీస్ లో ఇప్పటి వరకు లేనటువంటి సరికొత్త డిజైన్ మరియు కొన్ని కొత్త ఫీచర్స్ తో లాంచ్ కాబోతున్నట్లు రియల్ మీ కొత్త టీజర్ ద్వారా తెలియ పరిచింది.
రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా ప్రకటించలేదు ఈ ఫోన్ ను త్వరలో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. రియల్ మీ 15 ప్రో గేమ్ ఆఫ్ థ్రోన్స్ లిమిటెడ్ ఎడిషన్ గా ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుంది. ఫోన్ లాంచ్ డేట్ ని కూడా త్వరలోనే కంపెనీ విడుదల చేస్తుందని చెబుతున్నారు. ఈ రియల్ మీ ఫోన్ ను లిమిటెడ్ ఎడిషన్ గిఫ్ట్ బాక్స్ తో జతగా అందిస్తుంది. ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ కనిపించే బాక్స్ మాదిరిగా ఉన్నట్లు టీజర్ ఇమేజ్ చూస్తే అర్ధం అవుతుంది.
ఈ ఫోన్ కూడా రియల్ మీ 15 ప్రో స్మార్ట్ ఫోన్ కలిగిన అదే స్నాప్ డ్రాగన్ 7 Gen 4 చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఇందులో కూడా సూపర్ బ్రైట్నెస్ సపోర్ట్ కలిగిన 144Hz హైపర్ గ్లో 4D Curve ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్ వెనుక ప్రీమియం లెదర్ బ్యాక్ మరియు పైన పెద్ద ప్రీమియం కెమెరా బంప్ ఉంటుంది. ఈ ఫోన్ లోపల కూడా డీప్ కస్టమైజ్డ్ సిస్టం ఉంది ఇందులో గేమ్ ఆఫ్ థ్రోన్స్ థీమ్ ఇమేజెస్ మరియు స్క్రీన్ సేవర్స్ ఉంటాయి.
కెమెరా పరంగా, ఈ ఫోన్ లో 50MP Sony IMX 896 మెయిన్, 50MP అల్ట్రా వైడ్ మరియు మల్టీ స్పెక్ట్రల్ సెన్సార్ కలిగిన రియర్ కెమెరా మరియు ముందు 50MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ లో గేమ్ ఆఫ్ థ్రోన్ సిరీస్ లో కనిపించే కింగ్డమ్ మరియు నార్త్ ల్యాండ్ వంటి స్పెషల్ థీమ్ ఫోకస్ ఫిల్టర్లు మరియు ఇమేజ్ లను రే క్రియేట్ చేసే AI Edit Genie వంటి కెమెరా ఫీచర్స్ ఉంటాయి. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్, పార్టీ మోడ్, AI ల్యాండ్ స్కెప్ మరియు AI స్నాప్ మోడ్ వంటి మరిన్ని AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: boAt 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ భారీ డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది.!
డిజైన్ పరంగా, ఈ ఫోన్ 7.84mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది మరియు సరికొత్త ఆకర్షణీయమైన రూపం తో వస్తుంది. ఈ ఫోన్ లో కూడా 7000 mAh బిగ్ బ్యాటరీ మరియు పెద్ద కూలింగ్ సిస్టం ఆఫర్ చేస్తోంది. ఓవరాల్ గా ఈ అప్ కమింగ్ ఫోన్ సరికొత్త లుక్ మరియు గేమ్ ఆఫ్ థ్రోన్స్ థీమ్ తో వస్తుంది.