Realme 15 5G: టాప్ ఫీచర్లు మరియు అంచనా ప్రైస్ తెలుసుకోండి.!

Updated on 23-Jul-2025
HIGHLIGHTS

రియల్ మీ నంబర్ సిరీస్ నుంచి లాంచ్ చేస్తున్న లేటెస్ట్ స్మార్ట్ ఫోన్

రియల్ మీ 15 సిరీస్ ఫోన్లు రేపు ఇండియాలో లాంచ్ అవుతాయి

రియల్ మీ 15 స్మార్ట్ ఫోన్ టాప్ ఫీచర్లు మరియు అంచనా ప్రైస్ లాంచ్ కంటే ముందే తెలుసుకోండి

Realme 15 5G: రియల్ మీ నంబర్ సిరీస్ నుంచి లాంచ్ చేస్తున్న లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రియల్ మీ 15 సిరీస్ ఫోన్లు రేపు ఇండియాలో లాంచ్ అవుతాయి. ఈ సిరీస్ నుంచి రియల్ మీ 15 మరియు 15 ప్రో రెండు ఫోన్లు లాంచ్ చేస్తుంది. వాటిలో, బేసిక్ ఫోన్ రియల్ మీ 15 స్మార్ట్ ఫోన్ టాప్ ఫీచర్లు మరియు అంచనా ప్రైస్ లాంచ్ కంటే ముందే తెలుసుకోండి.

Realme 15 5G: లాంచ్

ఈ రియల్ మీ స్మార్ట్ ఫోన్ సిరీస్ రేపు రాత్రి 7 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబడుతుంది.

Realme 15 5G: టాప్ ఫీచర్లు ఏమిటి?

రియల్ మీ 15 ఫోన్ టాప్ ఫీచర్స్ ముందే వెల్లడించింది. ఈ ఫోన్ గొప్ప విజువల్స్ అందించే మరియు అందమైన లుక్స్ తో కనిపించే 4D కర్వ్ ప్లస్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు లేటెస్ట్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 2500 Hz జీరో ల్యాగ్ టచ్ రెస్పాన్స్ రేట్ కూడా కలిగి ఉంటుంది.

ఈ రియల్ మీ 15 స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7300+ చిప్ సెట్ తో వస్తుంది. ఇది మంచి మల్టీ టాస్కింగ్ హ్యాండ్లింగ్ చిప్ సెట్ మరియు గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుందని రియల్ మీ చెబుతోంది. ఈ ఫోన్ దీనికి తగిన ర్యామ్ మరియు గొప్ప ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 7.66mm సైజుతో స్లీక్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇంత స్లీక్ డిజైన్ లో కూడా ఈ ఫోన్ గొప్ప 7000 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది.

ఇక కెమెరా విభాగానికి వస్తే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఇందులో, డ్యూయల్ 50MP కెమెరాలు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ 4K రిజల్యూషన్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో AI పార్టీ మోడ్, AI మ్యాజిక్ గ్లో 2.0, AI ఎడిట్ జీనీ వంటి చాలా AI కెమెరా ఫీచర్లు కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ప్రీమియం లెథర్ డిజైన్ తో కూడా ఉంటుంది.

Also Read: Infinix Smart 10: బడ్జెట్ ప్రైస్ సెగ్మెంట్ లో ల్యాగ్ ఫ్రీ ఫోనుగా వస్తుందని కంపెనీ టీజింగ్.!

రియల్ మీ 15 : ప్రైస్

రియల్ మీ 15 ఫోన్ బేస్ మోడల్ అండర్ రూ. 20,000 సెగ్మెంట్ ఫోన్ గా వస్తుందని అంచనా వేస్తున్నారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :