Realme 13 Pro Series launch confirmed with DSLR like ultra clear camera
Realme 13 Pro Series: గత కొంత కాలంగా ‘Coming Soon’ ట్యాగ్ లైన్ తో టీజింగ్ చేస్తున్న రియల్‌మీ ఇప్పడు ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్లు ప్రకటించింది. రియల్‌మీ 13 ప్రో సిరీస్ నుండి రెండు ఫోన్లను జూలై 30న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ లను DSLR కంటే సూపర్ క్లారిటీ ఫోటోలు ఇచ్చే కెమెరాలతో తెస్తోందట.
రియల్‌మీ 13 ప్రో సిరీస్ నుండి రియల్‌మీ 13 ప్రో 5జి మరియు రియల్‌మీ 13 ప్రో ప్లస్ 5జి రెండు ఫోన్లను విడుదల చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ రెండు ఫోన్లను కూడా జూలై 30 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ కెమెరా ఫీచర్స్ తో కంపెనీ కొత్తగా ఆటపట్టిస్తోంది.
Also Read: Moto G85 5G Sale: మోటోరోలా పవర్ ఫుల్ బడ్జెట్ 3D కర్వుడ్ ఫోన్ ఫస్ట్ సేల్..!
రియల్‌మీ 13 ప్రో సిరీస్ ఫోన్స్ డ్యూయల్ Sony 50MP కొత్త సెన్సార్ లు కలిగిన మొదటి ఫోన్ అవుతాయని కంపెనీ టీజ్ చేస్తోంది. ఈ ఫోన్ లో Sony LYT 701 మెయిన్ సెన్సార్ మరియు 50MP Sony LYT – 600 పెరిస్కోప్ సెన్సార్ లు ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు, ప్రపంచంలో 50MP Sony LYT 701 సెన్సార్ కలిగిన మొదటి ఫోన్ కూడా ఇదే అవుతుందని కంపెనీ తెలిపింది.
హైపర్ ఇమేజ్ ప్లస్ AI కెమెరా సిస్టం కలిగిన రియల్‌మీ యొక్క మొదటి ఫోన్ కూడా ఇదే అని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ DSLR కంటే సూపర్ క్లారిటీ ఫోటోలు ఇచ్చే సత్తా కలిగి ఉంటుందని రియల్‌మీ గొప్పగా చెబుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ లో AI స్మార్ట్ రిమూవల్, AI గ్రూప్ ఫోటో ఎన్ హెన్స్మెంట్, AI ఆడియో జూమ్ వంటి చాలా AI ఫీచర్స్ ఉన్నాయని కూడా రియల్‌మీ చెబుతోంది.
ఈ విషయాలు అన్నీ చూస్తుంటే, ఈ ఫోన్ లను భారీ కెమెరా సెటప్ తో అందిస్తున్నట్లు క్లియర్ అవుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను ప్రపంచ ప్రముఖ ఆర్టిస్ట్ మోనెట్ ఇన్స్పిరేషన్ తో డిజైన్ ను రూపొందించినట్లు కూడా రియల్‌మీ తెలిపింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తెలిపింది కాబట్టి, ఈ ఫోన్ కీలకమైన ప్రత్యేకతలను కూడా ఒక్కొక్కటిగా బయటపెట్టే అవకాశం వుంది.