రియల్ మి 11 ప్రో సిరీస్ 200MP కెమేరా Curved డిస్ప్లేతో వస్తోంది.!
రియల్ మి 11 ప్రో సిరీస్ జూన్ 8 న ఇండియాలో విడుదల చేస్తోంది
కీలకమైన వివరాలతో కొత్త టీజింగ్ వచ్చింది
రియల్ మి 11 ప్రో సిరీస్ ఫోన్లలో 200MP కెమేరాతో పాటుగా Curved డిస్ప్లే ఉన్నట్లు వెల్లడించింది
రియల్ మి 11 ప్రో సిరీస్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్లను రియల్ మి జూన్ 8 న ఇండియాలో విడుదల చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ల ఫీచర్లు మరియు కీలకమైన వివరాలతో కొత్త టీజింగ్ లను అందిస్తోంది. కొత్తగా అందించిన టీజింగ్ ఇమేజ్ ద్వారా రియల్ మి 11 ప్రో సిరీస్ ఫోన్లలో 200MP కెమేరాతో పాటుగా Curved డిస్ప్లే కూడా ఉన్నట్లు వెల్లడించింది.
Surveyకొత్త టీజింగ్ ఏమి చెబుతోంది?
రియల్ మి 11 ప్రో సిరీస్ 5G ఫోన్ల కోసం రియల్ మి అందించిన కొత్త టీజింగ్ ఇమేజ్ లో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన Curved Vision Display తో ఈ ఫోన్ ను తీసుకు వస్తున్నట్లు తెలిపింది. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ లో 12GB ర్యామ్ మరియు 256GB వరకూ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నట్లు కూడా వివరాలను అందించింది.
ఈ రియల్ మి 11 ప్రో సిరీస్ టీజింగ్ ఇమేజ్ లో ఈ ఫోన్లో పైన ఎగువ భాగంలో పంచ్ హోల్ సెల్ఫీ కెమేరా వుంది. ఈ ఫోన్ లో 200MP ప్రో లెవల్ సూపర్ జూమ్ కెమేరా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇందులో Samsung ISOCELL HP3 సూపర్ జూమ్ సెన్సార్ వుంది.
రియల్ మి 11 ప్రో సిరీస్ ఈవెంట్ లైవ్ జూన్ 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి ప్రారంభమవుతుంది. అలాగే, జూన్ 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు 2 గంటల అర్లీ యాక్సెస్ సేల్ జరగుతుందని, జూన్ 9వ తేదీ ఉదయం 12 గంటల నుండి ఈ ఫోన్ Pre-Orders మొదలవుతాయని కూడా రియల్ మి తెలిపింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile