200MP కెమేరాతో వచ్చిన Realme 11 Pro+ 5G టాప్ 5 ఫీచర్లు తెలుసుకోండి.!

HIGHLIGHTS

Realme 11 Pro+ 5G యొక్క టాప్-5 ఫీచర్లు

కర్వ్డ్ డిస్ప్లే మరియు 100W సూపర్ ఉక్ ఛార్జింగ్ వంటి 5 ప్రధాన ఫీచర్లతో లాంఛ్ అయ్యింది

Dolby Atmos మరియు Hi-Res ఆడియో సర్టిఫికేషన్ తో డ్యూయల్ Linear స్పీకర్లను ఈ ఫోన్ కలిగి వుంది

200MP కెమేరాతో వచ్చిన Realme 11 Pro+ 5G టాప్ 5 ఫీచర్లు తెలుసుకోండి.!

నిన్న ఇండియాలో విడుదలైన రియల్ మి కొత్త స్మార్ట్ ఫోన్ Realme 11 Pro+ 5G యొక్క టాప్-5 ఫీచర్ల పైన ఒకలుక్కేద్దామా. ఈ లేటెస్ట్ ఫోన్ 200MP OIS కెమేరా, కర్వ్డ్ డిస్ప్లే మరియు 100W సూపర్ ఉక్ ఛార్జింగ్ వంటి 5 ప్రధాన ఫీచర్లతో ఇండియన్ మార్కెట్ లో లాంఛ్ అయ్యింది. మరి Realme 11 Pro+ 5G స్మార్ట్ ఫోన్ కలిగిన ఆ టాప్ 5 ఫీచర్లు ఏమిటో తెల్సుకుందాం పదండి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. డిజైన్ & డిస్ప్లే 

రియల్ మి 11 ప్రో+ ప్రీమియం లెథర్ వేగాన్ తో గొప్ప ప్రీమియం డిజైన్ కలిగి ఉండడమే కాకుండా ఆస్ట్రల్ బ్లాక్,ఒయాసిస్ గ్రీన్ మరియు సన్ రైజ్ బీజ్ అనే మూడు అందమైన కలర్ అప్షన్ లలో లాంఛ్ అయ్యింది. ఈ రియల్ మి ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ Curved OLED డిస్ప్లేని HDR 10+ సపోర్ట్ తో కలిగి వుంది. 

2. పెర్ఫార్మెన్స్

ఈ రియల్ మి ఫోన్ 2.6Ghz క్లాక్ స్పీడ్ కలిగిన మీడియాటెక్ Dimensity 7050 SoC తో పని చేస్తుంది మరియు దీనికి జతగా 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ వేగం మరింత పెంచేందుకు వీలుగా 12GB వరకూ Dynamic RAM సపోర్ట్ ను కూడా ఈ ఫోన్ లో జత చేసింది.

3. కెమేరా

రియల్ మి 11 ప్రో+ వెనుక ట్రిపుల్ కెమేరా వుంది. ఈ సెటప్ లో OIS సపోర్ట్ తో 200MP (Samsung ISOCELL HP3) హెవీ మెయిన్ కెమేరా, 8MP అల్ట్రా వైడ్ కెమేరా మరియు 2MP మ్యాక్రో కెమేరా ఉన్నాయి. ఈ కెమేరా 200MP మోడ్, సినీ మోడ్, స్టెరీ మోడ్ వంటి అనేక కెమేరా ఫీచర్లతో ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియోలను 30fps వద్ద షూట్ చెయ్యగలదు.  అలాగే, 1080p  వీడియో లను 30fps / 60fps వద్ద షూట్ చెయ్యగలదు. రియల్ మి 11 ప్రో+ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమేరాని పోర్ట్రైట్ మోడ్ వంటి మరిన్ని ఫీచర్లతో తో కలిగి వుంది. 

4. బ్యాటరీ 

రియల్ మి 11 ప్రో+ ఫోన్ 5000 mAh హెవీ బ్యాటరీని 100W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది మరియు బాక్స్ లో 100W అడాప్టర్ ను కూడా కలిగి వుంది.    

5. OS & ఆడియో

రియల్ మి 11 ప్రో+ స్మార్ట్ ఫోన్ Android 13 OS పైన రియల్ మి UI 4.0 సాఫ్ట్ వేర్ తో పని చేస్తుంది.  Dolby Atmos మరియు Hi-Res ఆడియో సర్టిఫికేషన్ తో డ్యూయల్ Linear స్పీకర్లను ఈ ఫోన్ కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo