తక్కువ ధరలో వచ్చిన Realme Curved డిస్ప్లే ఫోన్.. ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.!

Updated on 02-Jan-2023
HIGHLIGHTS

Realme ఇండియాలో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది

Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్ కేవలం మిడ్ రేంజ్ ధరలో ప్రీమియం ఫీచర్లతో వచ్చింది

Cured డిస్ప్లేతో పాటుగా 108MP ట్రిపుల్ కెమెరా మరియు వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్

ఈరోజు Realme ఇండియాలో తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది. అవే, Realme 10 Pro మరియు 10 Pro+ స్మార్ట్ ఫోన్లు. వీటిలో Realme 10 Pro+ స్మార్ట్ ఫోన్ ప్రీమియం ఫీచర్లతో కేవలం మిడ్ రేంజ్ ధరలో ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ ఫోన్ ప్రీమియం ఫోన్లలో మాత్రమే కనిపించే, Cured డిస్ప్లేతో పాటుగా  108MP ట్రిపుల్ కెమెరా మరియు వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ వంటి చాలా ప్రత్యేకతలతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశించింది. ఈ ఫోన్ యొక్క స్పెక్స్, ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.

Realme 10 Pro+5G: ధర

Realme 9 5G యొక్క బేసిక్ వేరియంట్ (6GB+128GB) రూ.24,999 ధరతో లాంచ్ కాగా, (8GB+128GB) వేరియంట్ రూ.25,999 ధరతో మరియు హై ఎండ్ వేరియంట్ (8GB+256GB) రూ.27,999 ధరతో లాంచ్ చెయ్యబడ్డాయి. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క డిసెంబర్ 14 నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. Realme అధికారిక వెబ్సైట్ realme.com మరియు Flipkart నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.    

Realme 10 Pro+5G: స్పెక్స్

Realme 10 Pro+5G స్మార్ట్ ఫోన్ 6.7-అంగుళాల FHD+ రిజల్యూషన్ Curved స్క్రీన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగివుంది మరియు ఇది పంచ్-హోల్‌ డిజైన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే 2160Hz డిమ్మింగ్, 100% DCI-P3 కలర్ గాముట్ మరియు 0.65mm డబుల్-రీఐన్ఫోర్స్డ్ గ్లాస్ సేఫ్టీతో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ ఫాస్ట్ ప్రాసెసర్ డైమెన్సిటీ 1080 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.

వెనుకవైపు, ఈ ఫోన్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌ మరియు 2MP (4cm) మాక్రో సెన్సార్  ఉన్నాయి. ఈ కెమెరాతో 30FPS తో 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు. అలాగే, ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని 67W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కలిగివుంది. ఈ 8GB వరకు డైనమిక్ ర్యామ్, డ్యూయల్-మోడ్ 5G, Hi-Res ఆడియో, సూపర్ లైనర్ డ్యూయల్ స్పీకర్లు, మొదలైన ఫీచర్లు కూడా అందుకుంటారు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :