Realme తన అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి ప్రకటించింది. Realme 10 స్మార్ట్ ఫోన్ ను డిసెంబర్ 9 వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు ఇండియాలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి చాలా కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్లను కూడా రియల్ మి టీజింగ్ ద్వారా బయటపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ గేమింగ్ ప్రాసెసర్ Helio G99 తో తీసుకు వస్తున్నట్లు టీజర్ ద్వారా తెలిపింది. ఈ ఫోన్ కోసం Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది. ఈ అప్ కమింగ్ Realme స్మార్ట్ ఫోన్ యొక్క స్పెక్స్ మరియు ఫీచర్ల పైన ఒక లుక్కేయండి.
Realme 10 స్మార్ట్ ఫోన్ ను 6.4 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేతో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ తో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ గేమింగ్ చిప్ సెట్ Helio G99 తో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు గరిష్టంగా 8GB డైనమిక్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుందని రియల్ మి టీజర్ ద్వారా వెల్లడించింది.
Realme 10 ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ వుంది. ఈ సెటప్ లో 50MP ప్రధాన కెమేరా మరియు మరొక కెమేరా ఉంటాయి. ఈ ఫోన్ ను ఆకర్షణీయమైన సన్నని డిజైన్ మరియు లైట్ వెయిట్ తో అందిస్తున్నట్లు కూడా రియల్ మి ఈ ఫోన్ టీజర్ నుండి చెబుతోంది.