Poco X8 Pro Max price and features know here
Poco X8 Pro Max: పోకో ఈరోజు నిర్వహించిన ఆన్లైన్ ఈవెంట్ నుంచి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు విడుదల చేసింది. పోకో ఎక్స్ 8 ప్రో సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్‌లను ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. వీటిలో పోకో X8 ప్రో మాక్స్ స్మార్ట్ ఫోన్ ను జబర్దస్త్ ఫీచర్స్ తో నమ్మశక్యం కానీ ధరలో రిలీజ్ చేసింది. ఈ లేటెస్ట్ పోకో స్మార్ట్ ఫోన్ ఈ సెగ్మెంట్లో ఎన్నడూ లేని విధంగా 9000 mAh భారీ బ్యాటరీ మరియు 3 మిలియన్ కంటే ఎక్కువ AnTuTu స్కోర్ అందించే మీడియాటెక్ చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది.
పోకో ఈ లేటెస్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ రెండు వేరియంట్ ప్రైస్ ఇక్కడ లిస్ట్ చేశాము.
ఈ ఫోన్ బ్లాక్, బ్లూ మరియు వైట్ కలర్ తో మొత్తం మూడు రంగుల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మార్చి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ అవుతుంది.
పోకో ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పై గొప్ప లాంచ్ ఆఫర్స్ కూడా ప్రకటించింది. ఈ ఫోన్ ను HDFC, SBI మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ తో తీసుకునే వారికి రూ. 3,000 బ్యాంక్ డిస్కౌంట్ లేదా ఎక్స్ చేంజ్ ఆఫర్ తో తీసుకునే వారికి రూ. 3,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఇది ఇవి కాకుండా ఈ ఫోన్ పై Spotify ప్రీమియం మరియు రూ. 7,000 రూపాయల విలువైన Youtube ప్రీమియం బెనిఫిట్ వంటి ఆఫర్స్ కూడా అందించింది.
Also Read: Apple AirPods Max 2: మరింత శక్తివంతమైన ANC మరియు బిగ్ బ్యాటరీతో వచ్చింది.!
పోకో ఈ స్మార్ట్ ఫోన్ 6.83 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ 1.5K రిజల్యూషన్ 60/90/120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2000 నిట్స్ HBM బ్రైట్నెస్ మరియు HDR 10 సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ మరియు లేటెస్ట్ అల్ట్రా సోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 20 కంటే ఎక్కువ గేమ్స్ ని 120FPS లో ప్లే చేసే సత్తా కలిగి ఉంటుంది.
ఈ పోకో స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 9500s చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది. ఇది మీడియా టెక్ యొక్క లేటెస్ట్ చిప్సెట్ మరియు ఇది 3 Mn కంటే అధిక AnTuTu స్కోర్ అందిస్తుంది. ఈ ఫోన్ 12GB LPDDR5X అల్ట్రా ర్యామ్ మరియు 512GB హెవీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 16 ఆపరేటింగ్ సిస్టం తో Hyper OS 3.0 సాఫ్ట్ వేర్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 4OS అప్గ్రేడ్ అండ్ 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది.
ఈ ఫోన్ కెమెరా పరంగా సింపుల్ అండ్ పవర్ ఫుల్ సెటప్ కలిగి వుంటుంది. ఈ ఫోన్ లో కేవలం 50MP (UW) మెయిన్ కెమెరా జతగా 8MP కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. అయితే, ఇది 60 FPS తో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 20MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ లో ముందు 20MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.
ఈ ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 9000 mAh అల్ట్రా బిగ్ బ్యాటరీ ని పోకో అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 100W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ పోకో స్మార్ట్ ఫోన్ 27W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ మరియు బైపాస్ ఛార్జ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP66, IP68, IP69 మరియు IP69K రేటింగ్ తో గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా ఉంటుంది. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.