Poco X5 Pro: పోకో కొత్త 5G ఫోన్ ధర మరియు ఫీచర్ల పైన ఒక లుక్కేద్దామా.!

HIGHLIGHTS

Poco X5 Pro ను ఈరోజు ఇండియాలో విడుదల చేసిన పోకో

ఈ స్మార్ట్ ఫోన్ ను ఆకర్షణీయమైన ఫీచర్లతో పోకో విడుదల చేసినట్లు చెబుతోంది

ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్ల పైన ఒక లుక్కేద్దామా

పోకో లేటెస్ట్ గా ఇండియాలో Poco X5 Pro స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను స్నాప్ డ్రాగన్ 778G ప్రాసెసర్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లే వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో ఇండియన్ మార్కెట్ లో పోకో విడుదల చేసినట్లు చెబుతోంది. మరి పోకో తీసుకొచ్చిన ఈ లేటెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్ల పైన ఒక లుక్కేద్దామా.         

Poco X4 Pro: ధర

పోకో ఎక్స్ 5 ప్రో స్మార్ట్ ఫోన్  రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలను క్రింద చూడవచ్చు.

1. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ : ధర రూ.22,999

3. 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ : ధర రూ.24,999

ఫిబ్రవరి 13 మధ్యాహ్నం 12 గంటల నుండి Flipakrt నుండి ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది. అలాగే, ఈ ఫోన్ పైన లిమిటెడ్ పిరియడ్ లాంచ్ అఫర్ కూడా వుంది.ICICI బ్యాంక్ కార్డ్స్ అప్షన్ తో ఈ ఫోన్ కొనేవారికి 2,000 తగ్గింపు లభిస్తుంది.

Poco X5 Pro: స్పెక్స్

పోకో X5 ప్రో 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.7-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌ను కలిగివుంది. ఈ డిస్ప్లే Dolby Vision కి సపోర్ట్ చేస్తుంది మరియు 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. ఈ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో, 108MP మైన్ కెమెరాకి జతగా 8MP అల్ట్రావైడ్ స్నాపర్ మరియు 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి. ముందు సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం 16MP ఫ్రెంట్ కెమేరా వుంది.  

ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 778G SoCతో పాటు గరిష్టంగా 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంటుంది. అలాగే, ఆండ్రాయిడ్ 12 OS ఆధారిత MIUI 14 సాఫ్ట్ వేర్ పైన ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ రన్ అవుతుంది. ఈ ఫోన్ 67W సోనిక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీని కలిగివుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :