ఇటీవల, పోకో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసిన ప్రీమియం Poco X4 Pro 5G ను ఇప్పుడు ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ MWC 2022 నుండి ఆవిష్కరించింది. పోకో ఈ స్మార్ట్ ఫోన్ ను మార్చి 28 మధ్యాహ్నం 12 గంటలకి ఇండియాలో విడుదల చేయడానికి డేట్ మరియు టైం ఫిక్స్ చేసింది. ఈ ఫోన్ యొక్క గ్లోబల్ వేరియంట్ ప్రీమియం స్పెక్స్ మరియు ఆకర్షణీయమైన డిజైన్ తో వచ్చింది. అయితే, ఇండియా వేరియంట్ లో కొత్త మార్పులు ఉండేలా కనిపిస్తోంది.
పోకో ఎక్స్4 ప్రో 5జి యొక్క ఇండియా లాంచ్ కోసం కంపెనీ కొన్ని కీలకమైన స్పెక్స్ ను వెల్లడించింది. ఈ స్పెక్స్ ను పరిశీలిస్తే, గ్లోబల్ వేరియంట్ మరియు ఇండియాలో లాంచ్ చేయబోతున్న వేరియంట్ లలో కెమెరా పరంగా మార్పులు ఉండవచ్చు. పోకో ఎక్స్4 ప్రో 5జి గ్లోబల్ వేరియంట్ 108MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ మరియు 2MP మాక్రో మాడ్యూల్ ఉంటాయి. కానీ, పోకో అందించిన టీజర్ ద్వారా 64MP AI ట్రిపుల్ కెమెరాతో వస్తున్నట్లు చూపించింది. డిస్ప్లే మరియు బ్యాటరీ వంటి మరిన్ని ఫీచర్లు మాత్రం ఒకేవిధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
పోకో X4 ప్రో 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.7-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం ఈ ఫోన్ లో సెంట్రల్ కటౌట్ ఉంది. ఇందులో 16ఎంపి సెల్ఫీ కెమెరాను కలిగి వుంది. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో, 108MP మైన్ కెమెరాకి జతగా 8MP అల్ట్రావైడ్ స్నాపర్ మరియు 2MP మాక్రో లెన్స్ ఉన్నాయి.
ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G SoCతో పాటు గరిష్టంగా 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంటుంది. అలాగే, ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI 13 పైన రన్ అవుతుంది మరియు డైనమిక్ర్యామ్ సపోర్ట్ కూడా వుంది. ఈ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బ్యాటరీని కలిగి ఉండడమే కాకుండా IP53 డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెన్స్ కలిగివుంది.