POCO X3 Pro గొరిల్లా గ్లాస్ 6 తో వస్తోందా?

Updated on 18-Mar-2021
HIGHLIGHTS

ఈ ఫోన్ మరింత స్ట్రాంగ్ మరియు పవర్ ఫుల్

POCO త్వరలో లాంచ్ చేయనున్నస్మార్ట్ ఫోన్ గురించి మరిన్ని విషయాలు ఆన్లైన్లో లీక్ అవుతున్నాయి. మార్చి 30 న ఇండియన్ మార్కెట్లో తన కొత్త PRO స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు పోకో ప్రకటించింది. త్వరలో లాంచ్ చెయ్యనున్న స్మార్ట్ ఫోన్ ఇటీవల విడుదలైన X3 యొక్క ప్రో వెర్షన్ POCO X3 Pro కావచ్చని ఇప్పటికే రూమర్లు వస్తున్నాయి. అయితే, కొత్తగా పోకో అందించిన టీజింగ్ ద్వారా ఈ ఫోన్ మరింత స్ట్రాంగ్ మరియు పవర్ ఫుల్ గా ఉండనున్నట్లు కనిపిస్తోంది.

POCO తన అధికారిక ట్విట్టర్ హ్యడిల్ నుండి విడుదల చేసిన టీజర్ లో మార్చి 30 న విడుదల చేయనున్నట్లు చెబుతున్న స్మార్ట్ ఫోన్ లో గొరిల్లా గ్లాస్ 6 తో వస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఈ ఫోన్ గురించి వస్తున్నా లీక్స్ మరియు రూమర్లు చూస్తుంటే మాత్రం ఈ ఫోన్ ఎక్కువ ఫీచర్లతో చాలా తక్కువ ధరలో మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

ఇక ముందుగా వచ్చిన లీక్స్ మరియు రూమర్ల ప్రకారం, ఇందులో పెద్ద FHD+ డిస్ప్లేని 120Hz ఉందవచ్చు. ప్రాసెసర్ కూడా చాలా వేగవంతమైనదిగా ఇవ్వవచ్చు. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 860 ఆక్టా కోర్ ప్రాసెసర్ ని ఇవ్వొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. అలాగే, వేగవంతమైన ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన పెద్ద బ్యాటరీ సెటప్ కూడా ఉంటుందని అంచనా. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :