Poco X3: భారీ ఫీచర్లతో తక్కువ ధరలో వచ్చింది

HIGHLIGHTS

పోకో ఎక్స్3 క్వాల్‌ కామ్ స్నాప్‌ డ్రాగన్ 732 జి ప్రాసెసర్‌తో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్‌ ఫోన్ గా నిలిచింది.

పోకో ఎక్స్3 క్వాల్‌ కామ్ స్నాప్‌ డ్రాగన్ 732 జి ప్రాసెసర్‌తో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్‌ ఫోన్ గా నిలిచింది.

పోకో ఎక్స్3 అధిక రిఫ్రెష్-రేట్ డిస్ప్లే, 64 ఎంపి క్వాడ్ కెమెరాలు మరియు మరెన్నోభారీ ఫీచర్లను కలిగి ఉంది,

Poco X3 ఈ నెల ప్రారంభంలో Poco X3 NFC గా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తరువాత, ఇప్పుడు భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. పోకో ఎక్స్3 క్వాల్‌ కామ్ స్నాప్‌ డ్రాగన్ 732 జి ప్రాసెసర్‌తో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్‌ ఫోన్ గా నిలిచింది. గ్లోబల్ వేరియంట్ ఎన్‌ఎఫ్‌సికి మద్దతు ఇస్తుండగా, పోకో ఎక్స్ 3 యొక్క ఇండియన్ వేరియంట్ దీనికి బదులుగా 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

పోకో ఎక్స్3 అధిక రిఫ్రెష్-రేట్ డిస్ప్లే, 64 ఎంపి క్వాడ్ కెమెరాలు మరియు మరెన్నోభారీ ఫీచర్లను కలిగి ఉంది, ఇది శక్తివంతమైన మిడ్ -రేంజ్ ఫోన్. భారతదేశంలో పోకో ఎక్స్ 3 యొక్క ధర, ఫీచర్లు మరియు సేల్ వంటి వివరాలను పరిశీలిద్దాం.

Poco X3: Price 

పోకో ఎక్స్3 ముచ్చటైన మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఈ వేరియంట్స్,  6 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్  రూ .16,999 ధరతో, 6 జిబి + 128 జిబి వేరియంట్ రూ .18,499 ధరతో  మరియు 8 జిబి + 128 జిబి స్టోరేజ్ వేరియంట్‌ రూ .19,999 ధరతో ప్రకటించబడ్డాయి. Poco X3 స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 29 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి వస్తుంది.

Poco X3: ఫీచర్లు

పోకో ఎక్స్3 6.67-అంగుళాల పూర్తి HD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్‌ప్లేను 120 హెర్ట్జ్ హై-రిఫ్రెష్-రేట్ మరియు హెచ్‌డిఆర్ 10 సపోర్ట్‌తో కలిగి ఉంది. స్క్రీన్ 20MP సెల్ఫీ కెమెరా కోసం సెంటర్ పంచ్-హోల్ నాచ్ కటౌట్ కలిగి ఉంది మరియు గొరిల్లా గ్లాస్ 5 పొరతో ఉంది. ఇది ఒక గ్లాస్ బ్యాక్ కలిగి ఉంది మరియు X3 IP53 రేట్ చేయబడింది, అంటే లోపల నీటి వికర్షకం పూత ఉంది.

పోకో ఎక్స్3 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 732 జి ఆక్టా-కోర్ ప్రాసెసర్ మరియు అడ్రినో 618 జిపియుతో పనిచేస్తుంది. ఇది MIUI 12 ఆధారిత పోకో లాంచర్‌ తో పనిచేస్తుంది. పోకో ఎక్స్3 8GB RAM మరియు 128GB స్టోరేజ్ తో జత చేయబడింది. ఈ ఫోన్ 512GB వరకు మైక్రో SD కార్డులకు కూడా మద్దతు ఇస్తుంది, కాబట్టి వినియోగదారులు వారి అవసరాలకు అనుగుణంగా స్టోరేజ్ ను మరింతగా విస్తరించవచ్చు.

పోకో ఎక్స్ 3 క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తుంది, ఇందులో ప్రాధమిక 64 MP కెమెరాతో ఎఫ్ / 1.8 ఎపర్చరుతో, 8 MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా 119-డిగ్రీ ఫీల్డ్-వ్యూ, 2 MP మాక్రో కెమెరా మరియు 2 MP డెప్త్ సెన్సార్ లతో వుంటుంది.

ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది మరియు ఈ ఫోన్ ఎక్కువ పని సమయం పని చేయడానికి వీలుగా 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు బాక్స్ లోనే ఛార్జర్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :