Poco M8 5G with 7.35mm sleek and light weight design india launch confirmed
Poco M8 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ ను 7.35mm స్లీక్ అండ్ లైట్ వెయిట్ డిజైన్ తో లాంచ్ చేయబోతున్నట్లు ఈరోజు పోకో కొత్త టీజర్ విడుదల చేసింది. ఈ ఫోన్ లాంచ్ కోసం అందించిన ఈ టీజర్ వీడియో నుంచి ఈ ఫోన్ యొక్క మొదటి వివరాలు అందించింది. ఈ ఫోన్ ను పోకో బడ్జెట్ సిరీస్ నుంచి నెక్స్ట్ జనరేషన్ ఫోన్ గా లాంచ్ చేస్తోంది.
పోకో ఎం8 5జి స్మార్ట్ ఫోన్ కోసం ఈరోజు పోకో అఫీషియల్ x అకౌంట్ నుంచి ఈ కొత్త టీజర్ వీడియో విడుదల చేసింది . ఈ వీడియో లో పోకో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ వివరాలు అందించింది. ఈ ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ అవుతుందని పోకో ఈ టిజర్ లో వెల్లడించింది. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు.
కంపెనీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క డిజైన్ వివరించేలా ఈ కొత్త టీజర్ అందించింది. ఈ టీజర్ ప్రకారం, పోకో ఎం8 స్మార్ట్ ఫోన్ కేవలం 7.35mm స్లీక్ డిజైన్ కలిగి ఉంటుంది. పోకో M సిరీస్ నుంచి అందించిన గత సిరీస్ ఫోన్లతో పోలిస్తే ఇది మరింత స్లీక్ గా ఉంటుంది. అంతేకాదు, ఈ కొత్త ఫోన్ కేవలం 178 గ్రాముల బరువు మాత్రమే ఉంటుందట. అంటే, గత జనరేషన్ ఫోన్స్ తో పోలిస్తే దాదాపు 100 గ్రాముల వరకు తక్కువ బరువు ఉంటుంది.
ఇక డిజైన్ పరంగా చూస్తే, ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో కర్వుడ్ డిస్ప్లే ఉన్నట్లు కన్ఫర్మ్ అవుతుంది. అంతేకాదు, గత ఇమేజెస్ ద్వారా ఈ ఫోన్ లో కెవ్లార్ ఎడ్జెస్ ఉన్నట్లు కనిపిస్తోంది. అంటే, ఈ ఫోన్ స్టైలిష్ డిజైన్ తో పాటు కెవ్లార్ బ్యాక్ తో చాలా పటిష్టంగా ఉండే అవకాశం ఉండవచ్చు.
ఇక ఈ ఫోన్ గురించి ఇప్పటికే వస్తున్నా రూమర్లు మరియు లీక్స్ ను పరిశీలిస్తే, పోకో ఎం 8 స్మార్ట్ ఫోన్ బిగ్ కర్వుడ్ స్క్రీన్ తో లాంచ్ కావచ్చని తెలుస్తోంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ ఉండే అవకాశం ఉందట. కొత్త రూమర్స్ మరియు లీక్స్ ద్వారా పోకో ఎం8 ఫోన్ ను Snapdragon 6 Gen 3 తో లాంచ్ చేసే అవకాశం ఉంది.
Also Read: 2026 New Year Gift: కొత్త సంవత్సరం గిఫ్ట్ కోసం ఆన్లైన్లో వెతికే వారికి గుడ్ న్యూస్.!
ఇక ముందుగా అందించి ఫస్ట్ టీజర్ వీడియో ద్వారా, ఈ ఫోన్ లో 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. ఈ ఫోన్ డిజైన్ ప్రధానంగా పోకో ఈ ఫోన్ గురించి టీజింగ్ చేస్తోంది. అన్ని కలిపి చూస్తే ఈ పోకో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్ పవర్ ఫుల్ ఫోన్ గా మార్కెట్ లో అడుగుపెట్టే అవకాశం ఉండవచ్చు.