ఈరోజు నుండి మొదలైన POCO M6 5G Sale..ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.!

HIGHLIGHTS

POCO M6 5G Sale రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి స్టార్ట్ అయ్యింది

ఈ ఫోన్ ను రూ. 10,499 ప్రారంభ ధరతో వచ్చింది

ఈ ఫోన్ పైన HDFC మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 10% డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది

పోకో లేటెస్ట్ గా విడుదల చేసిన POCO M6 5G Sale రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి స్టార్ట్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో ఇండియన్ మార్కెట్ లో ఉన్న చాలా స్మార్ట్ ఫోన్ లకు ఫొటోగా ఈ ఫోన్ ను తీసుకు వచ్చింది పోకో. ఈ సిరీస్ నుండి ముందుగా ప్రో వేరియంట్ ను విడుదల చేసిన కంపెనీ ఇటీవల రెగ్యులర్ వేరియంట్ పోకో ఎం6 5జి ని కూడా విడుదల చేసింది. ఈ ఫోన్ కొనే ముందుగా ఈ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు తెలుసుకోండి.

POCO M6 5G Sale

పోకో ఎం6 5జి స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి మొదలయ్యింది. ఈ ఫోన్ ను రూ. 10,499 ప్రారంభ ధరతో వచ్చింది. ఇది 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో ఉంటుంది. ఈ ఫోన్ యొక్క 6GB + 128GB వేరియంట్ ను రూ. 11,499 ధరతో మరియు 8GB + 256GB వేరియంట్ ను రూ. 13,499 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పైన HDFC మరియు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 10% డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

Also Read : SAMSUNG Galaxy S22 5G పైన ఫ్లిప్ కార్ట్ Winter Fest Sale భారీ డిస్కౌంట్.!

పోకో ఎం6 5జి స్పెక్స్ & ఫీచర్స్

ప్రొకో ఎం6 స్మార్ట్ ఫోన్ ను పెద్ద 6.74 ఇంచ్ HD+ డిస్ప్లేని కలిగి వుంది. ఈ ఫోన్ Dimensity 6100+ 5జి ప్రోసెసర్ ని 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో కలిగి వుంది. ఈ ఫోన్ గెలాక్టిక్ బ్లాక్ మరియు ఓరియన్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ లో 8 GB వరకూ Virtual RAM సపోర్ట్ కూడా వుంది. ఈ ఫోన్ ను చాలా స్లీక్ గా మరియు ఆకర్షణీయమైన డిజైన్ తో పోకో అందించింది.

పోకో ఎం6 5జి స్పెక్స్ & ఫీచర్స్

ఈ ఫోన్ లో 50MP AI డ్యూయల్ కెమేరా, 5MP సెల్ఫీ కెమేరా మరియు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. ఇది 5000mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ MIUI 14 సాఫ్ట్ వేర్ పైన Android 13 తో పని చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :