POCO M6 5G phone launched with 50mp camera
పోకో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ POCO M6 5G ఈరోజు మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ కొత్త పోకో స్మార్ట్ ఫోన్ 50MP డ్యూయల్ కెమేరా మరియు 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ధరలో వచ్చింది. పోకో ఎం సిరీస్ నుండి ముందుగా విడుదల చేసిన ఫోన్ ల మాదిరిగానే ఈ ఫోన్ ను కూడా బడ్జెట్ ధరలో ఆకర్షనీయమైన ఫీచర్లతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క ధర, స్పెక్స్ మరోయు ఫీచర్లు ఏమిటో చూసేద్దామా.
పోకో ఎం6 5జి స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్ లలో లాంచ్ చేసింది పోకో. ఈ స్మార్ట్ యొక్క మూడు వేరియంట్ ధర వివరాలు ఇక్కడ చూడవచ్చు.
పోకో ఎం6 5జి (4GB + 128GB) వేరియంట్ ధర రూ. 10,499
పోకో ఎం6 5జి (6GB + 128GB) వేరియంట్ ధర రూ. 11,499
పోకో ఎం6 5జి (8GB + 256GB) వేరియంట్ ధర రూ. 13,499
పోకో ఎం6 5జి స్మార్ట్ ఫోన్ పైన రూ. 1,000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ ను కూడా జత చేసింది. ఈ ఫోన్ డిసెంబర్ 26న మొదటిసారి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
Also Read : బడ్జెట్ ధరలో వచ్చిన Lava Storm 5G టాప్ 5 ఫీచర్ల పైన ఒక లుక్కేద్దామా.!
పోకో ఎం6 5జి స్మార్ట్ ఫోన్ 6.74 ఇంచ్ HD+ డిస్ప్లేని 1650 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్ తో కలిగి వుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ మరియు Gorilla Glass 3 గ్లాస్ ప్రొటెక్షన్ తో కలిగి ఉంటుంది. ఈ పోకో లేటెస్ట్ 5జి ఫోన్ Dimensity 6100+ ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వస్తుంది మరియు 8 GB ర్యామ్ కి జతగా 256 GB వరకూ స్టోరేజ్ ను కూడా కలిగి వుంటుంది.
ఈ ఫోన్ లో 50MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 5MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఈ కెమేరాతో 1080p వీడియోలను 30 fps రికార్డ్ చేసే వీలుంది. పోకో ఎం6 5జి ఫోన్ లో 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ వుంది. అలాగే, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 8GB టర్బో ర్యామ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.