50MP కెమెరా DCI-P3 డిస్ప్లేతో వస్తున్న పోకో ఎం4 ప్రో 5జి

Updated on 13-Feb-2022
HIGHLIGHTS

POCO M4 Pro 5G మరో రెండు రోజుల్లో ఇండియాలో విడుదల కానుంది

ఈ ఫోన్ డైమెన్సిటీ 810 మరియు 50ఎంపి కెమెరాతో వస్తున్నట్లు పోకో రివీల్ చేసింది

ఇది మంచి గేమింగ్ మరియు 5G సపోర్ట్ చేస్తుంది

పోకో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ POCO M4 Pro 5G మరో రెండు రోజుల్లో ఇండియాలో విడుదల కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో ఫిబ్రవరి 15 న లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ యొక్క టీజర్ మరియు రివీల్డ్ ఫీచర్లు చూస్తుంటే మాత్రం ఈ ఫోన్ గ్లోబల్ వేరియంట్ మాదిరిగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ ఫోన్ డైమెన్సిటీ 810 మరియు 50ఎంపి కెమెరాతో వస్తున్నట్లు పోకో రివీల్ చేసింది. గ్లోబల్ వేరియంట్ కూడా ఇవే ప్రధాన ఫీచర్లతో వచ్చింది. దీని ప్రకారం చూస్తే, గ్లోబల్ వేరియంట్ అదే పేరుతో ఇండియాలో కూడా లాంచ్ కావచ్చని అంచనా వేస్తున్నారు.

పోకో ఎం4 ప్రో 5జి సెక్స్, ఫీచర్లు మరియు ధర వివరాలను ఈ క్రింద చూడవచ్చు.

POCO M4 Pro 5G: స్పెక్స్ (గ్లోబల్ వేరియంట్)

ఈ POCO M4 Pro 5G ఫోన్ పెద్ద 6.6 అంగుళాల FHD+ పంచ్ హోల్ డిజైన్ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేటుతో కలిగివుంది. ఇది DCI-P3 సపోర్ట్ డిస్ప్లేతో ఉంటుంది మరియు ఎండలో కూడా చక్కగా కనిపిస్తుంది. ఈ ఫోన్‌లో లేటెస్ట్ మీడియాటెక్ 5G ప్రోసెసర్ డైమెన్సిటీ 810 SoC ని కలిగి వుంది. ఈ ప్రొసెసర్ గరిష్టంగా 2.4 Ghz స్పీడ్ కలిగిన ఆక్టా కోర్ SoC మరియు Arm Mali-G57 MC2 GPU తో జతగా ఉంటుంది మరియు 6nm ప్రోసెసర్. ఇది మంచి గేమింగ్ మరియు 5G సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన MIUI 12.5 స్కిన్ పైన నడుస్తుంది.

పోకో ఎం4 ప్రో 5G  వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ తో వచ్చింది. అయితే, ఇది ఎక్కువ కెమెరాలతో ఉన్నట్లుగా కనిపించేలా డిజైన్ కలిగి ఉంటుంది. ఈ సెటప్ లో 50ఎంపి ప్రధాన కెమెరా మరియు 8ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా అందించింది మరియు LED ఫ్లాష్ లైట్ ను కూడా కెమెరాతో జతగా ఇచ్చింది. ముందుభాగంలో, 16ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది.

పోకో ఎం4 ప్రో 5G ఫోన్ 5000 mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించింది. ఈ ఫోన్ లో వేలిముద్ర సెన్సార్ ను సైడ్ లో ఇచ్చింది మరియు AI ఫేస్ అన్లాక్ కు కూడా సపోర్ట్ వుంది.  ఇందులో డ్యూయల్ స్పీకర్లు కూడా అందించింది. 

POCO M4 Pro 5G: ధర (గ్లోబల్ వేరియంట్)

POCO M4 Pro 5G రెండు వేరియంట్ లలో వస్తుంది. వీటిలో బేసిక్ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో € 229 (సుమారు రూ. 19,600) ధరతో వచ్చింది. ఇక రెండవ వేరియంట్ 6GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ తో € 249 (సుమారు రూ. 21,400) ధరతో వచ్చింది. ఈ ఫోన్ కూల్ బ్లూ, పవర్ బ్లాక్ మరియు పోకో ఎల్లో అనే మూడు కలర్ అప్షన్ లలో లభిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :