Poco M4 5G: ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ నుండి చవక ధరకే లభిస్తోంది.!

HIGHLIGHTS

Flipkart Electronics Sale నుండి మొబైల్స్ పైన మంచి డీల్స్

ఈ ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ నుండి Poco M4 5G చవక ధరకే లభిస్తోంది

ఈరోజు ఈబెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్ ను కొనుగోలుదారు కోసం అందించింది

Poco M4 5G: ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ నుండి చవక ధరకే లభిస్తోంది.!

Flipkart Electronics Sale నుండి మొబైల్స్ మరియు ఇతర ఎలక్ట్రానిక్స్ పైన మంచి డీల్స్ అఫర్ చేస్తోంది. ఈ  ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ నుండి Poco M4 5G చవక ధరకే లభిస్తోంది. ఫ్లిప్ ఆకృతి ప్రకటించిన ఈ సేల్ రేపటితో ముగుస్తుండగా ఈరోజు ఈబెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్ ను కొనుగోలుదారు కోసం అందించింది. ఈ ఆఫర్ ద్వారా Poco M4 5G స్మార్ట్ ఫోన్ ను చాలా చవక ధరకే పొందే వీలుంది. ఈ బెస్ట్ డీల్ పైన ఒక లుక్కేద్దామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Poco M4 5G: ధర & ఆఫర్స్ 

పోకో యొక్క బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్ ఆకృతి సేల్ నుండి మంచి సిడిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో చవక ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ రూ.12,999  ఇండియన్ మార్కెట్ లో అడుగుపెట్టగా, ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ నుండి 2,000 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ. 10,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. 

ఈ ఫోన్ ను SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో కొనుగోలు చేసే వారికి 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ బ్యాంక్ అఫర్ తో మీరు ఈ పోకో 5G ఫోన్ ను రూ. 9,999 రూపాయల చవక ధరకే పొందే వీలుంది. 

Poco M4 5G: ప్రత్యేకతలు

ఇక ఈ పోకో 5G స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ Dimensity 700 5G ప్రోసెసర్ తో పనిచేస్తుంది మరియు జతగా 4GB సపోర్ట్ కూడా ఉంటుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.58 FHD+ డిస్ప్లేని కలిగి వుంది మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. 

ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000mAh బిగ్ బ్యాటరీతో ఉంటుంది మరియు MIUI 13 సాఫ్ట్ వేర్ ఆధారిత Android 12 OS పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ 'కెమేరా వుంది. ఇందులో 50MP+2MP కెమేరాలు ఉన్నాయి మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరా కూడా వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo