POCO M3 పెద్ద బ్యాటరీ మరియు కొత్త డిజైన్ తో ఇండియాలో రిలీజ్ అవుతోంది

Updated on 28-Jan-2021
HIGHLIGHTS

POCO M3 రిలీజ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్.

ఫిబ్రవరి 2 మధ్యాహ్నం 12 గంటలకి

పోకో M3 స్పెషిఫికేషన్ల టీజింగ్ వీడియో కూడా రిలీజ్ చేసింది.

POCO M3 పెద్ద బ్యాటరీ మరియు కొత్త డిజైనుతో ఇండియాలో రిలీజ్ అవుతోంది. పోకో M3 ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలలో రిలీజ్ చెయ్యబడింది మరియు సేల్ కూడా అవుతోంది. అయితే, ఇండియాలో మాత్రం ఫిబ్రవరి 2  మధ్యాహ్నం 12 గంటలకి వర్చువల్ ఈవెంట్ ద్వారా రిలీజ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేసింది.

కంపెనీ, ఈ M3 స్మార్ట్ ఫోన్ రిలీజ్ కి సంభందించిన టీజింగ్ ని తన అన్ని షోషల్ ప్లాట్ఫారం నుండి ఇప్పటికే రిలీజ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ Flipkart ద్వారా సేల్ అవనునట్లు కూడా చూపించింది. దీనితో పాటుగా, పోకో M3 స్మార్ట్ ఫోన్ యొక్క ప్రధాన స్పెషిఫికేషన్లతో కూడిన టీజింగ్ వీడియోను కూడా రిలీజ్ చేసింది.

గ్లోబల్ POCO M3 స్పెషిఫికేషన్ల పరంగా, క్వాల్కమ్ కొత్తగా ప్రకటించిన స్నాప్ డ్రాగన్ 662 ఆక్టా కోర్ ప్రోసెసర్, పెద్ద 6.53 FHD+ రిజల్యూషన్ డిస్ప్లే తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, పెద్ద 6000 mAh బ్యాటరీని 22.5 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో కలిగి వుంటుంది. కెమెరా విషయానికి వస్తే, వెనుక 48MP AI ట్రిపుల్ రియర్ కెమెరాని, ముందు సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరాని కలిగి వుంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :