Poco M3 హలో ఎల్లో సేల్: 128 స్టోరేజ్ వేరియంట్ కేవలం 11,999 మాత్రమే

HIGHLIGHTS

Poco M3 హలో ఎల్లో సేల్

Flipkart లో కొనడానికి అందుబాటులో వుంటుంది.

పోకో M3 స్మార్ట్ ఫోన్ 6GB ర్యామ్ కి జతగా 128GB స్టోరేజ్ వేరియంట్

ఇటీవల ఇండియాలో విడుదలైన Poco M3 యొక్క సేల్ మరికొద్ది సేపట్లో మోదలవుతుంది. ఈ Poco M3 యొక్క 6GB మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ అందుబాటులో ఉండగా, 6GB మరియు 128GB మరియు Poco M3 హలో ఎల్లో సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి మొదలువుతుంది.         

POCO M3 ధర:

పోకో M3 స్మార్ట్ ఫోన్ 6GB ర్యామ్ కి జతగా 128GB  స్టోరేజ్ వేరియంట్ ను రూ. 11,999 రూపాయల ధరతో విడుదల చేసింది. POCO M3 హలో ఎల్లో వేరియంట్ ను ఈరోజు నుండి Flipkart లో కొనడానికి అందుబాటులో వుంటుంది. మధ్యాహ్నం 12 గంటలకి Flipkart నుండి సేల్ మొదలవుతుంది.                   

POCO M3 స్పెషిఫికేషన్స్

POCO M3 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.53 అంగుళాల FHD+ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే19.5:9 ఎస్పెక్ట్ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 662 ఆక్టా కోర్ ప్రొసెసర్ ని కలిగి వుంది. ఇది Adreno 610 GPU తో  వస్తుంది మరియు 6GB ర్యామ్ మరియు 64GB /128GB స్టోరేజ్ అప్షన్లతో వస్తుంది. స్టోరేజ్ ను మరింతగా పెంచుకోవడానికి SD కార్డు అప్షన్ కూడా ఇవ్వబడింది.

పోకో M3 లోని కెమెరాల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ లో 48MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మ్యాక్రో సెన్సార్ వున్నాయి. ఈ ఫోన్ ముందుభాగంలో సెల్ఫీల కోసం సెల్ఫీ కెమెరాని వాటర్ డ్రాప్ నోచ్ లో అందించింది. ఇందులో, 8MP సెన్సార్ ని ఉంచింది. స్మార్ట్ ఫోన్ మొత్తానికి పవర్ అందించడాని అతిపెద్ద 6,000 mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో అందించింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :