5 లక్షల సేల్ మార్క్ దాటిన పోకో ఎం3 స్మార్ట్ ఫోన్

HIGHLIGHTS

పోకో M3 రికార్డ్ సేల్స్

ఏకంగా 5 లక్షల సేల్ మార్క్

మంచి అమ్మకాలను సాధించిందని కంపెనీ ప్రకటించింది.

ఇటీవల పోకో ఇండియాలో ప్రవేశపెట్టిన POCO M3 స్మార్ట్ ఫోన్ మంచి అమ్మకాలను సాధించిందని కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ ఏకంగా 5 లక్షల సేల్ మార్క్ ను దాటినట్లు వెల్లడించింది. ఈ ఫోన్ కేవలం పదివేల రూపాయల ధరలో 48MP ట్రిపుల్ కెమెరా, 6GB ర్యామ్ మరియు అతిపెద్ద 6000mAh బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వుంటుంది.          

POCO M3 స్పెషిఫికేషన్స్

POCO M3 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.53 అంగుళాల FHD+ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే19.5:9 ఎస్పెక్ట్ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 662 ఆక్టా కోర్ ప్రొసెసర్ ని కలిగి వుంది. ఇది Adreno 610 GPU తో  వస్తుంది మరియు 6GB ర్యామ్ మరియు 64GB /128GB స్టోరేజ్ అప్షన్లతో వస్తుంది. స్టోరేజ్ ను మరింతగా పెంచుకోవడానికి SD కార్డు అప్షన్ కూడా ఇవ్వబడింది.

పోకో M3 లోని కెమెరాల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ లో 48MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మ్యాక్రో సెన్సార్ వున్నాయి. ఈ ఫోన్ ముందుభాగంలో సెల్ఫీల కోసం సెల్ఫీ కెమెరాని వాటర్ డ్రాప్ నోచ్ లో అందించింది. ఇందులో, 8MP సెన్సార్ ని ఉంచింది. స్మార్ట్ ఫోన్ మొత్తానికి పవర్ అందించడాని అతిపెద్ద 6,000 mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో అందించింది.

POCO M3 ధర:

పోకో M3 స్మార్ట్ ఫోన్ 6GB ర్యామ్ కి జతగా 64GB  స్టోరేజ్ వేరియంట్ ను రూ. 10,999 రూపాయల ధరతో, 6GB ర్యామ్ కి జతగా 128GB  స్టోరేజ్ వేరియంట్ ను రూ. 10,999 రూపాయల ధరతో విడుదల చేసింది. POCO M3 స్మార్ట్ ఫోన్ Flipkart లో కొనడానికి అందుబాటులో వుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :