poco f7 5g launch india price specs top 5 features and sale
Poco F7 ఫోన్ లో మిమ్మల్ని ఆకట్టుకునే టాప్ 5 ఫీచర్స్ ఇవే కావచ్చు అని మేము అనుకుంటున్నాం. కేవలం మేము మాత్రమే కాదు షియోమీ కంపెనీ కూడా దాదాపు ఇదే మాట చెబుతోంది. ఎందుకంటే, ఈ ఫోన్ ను గేమింగ్, వీడియో మరియు కఠిమైన మల్టీ టాస్క్ లను సైతం సునాయాసంగా నిర్వహించేలా అందించినట్లు కంపెనీ చెబుతోంది. మరి ఈ ఫోన్ గురించి కంపెనీ చెబుతున్న ఆ టాప్ 5 ఫీచర్స్ ఏమిటో చూసేద్దామా.
షియోమీ ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 31,999 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ తో లాంచ్ చేసింది. ఇది ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ వేరియంట్ ప్రైస్. ఈ ఫోన్ యొక్క 12 జీబీ ర్యామ్ మరియు 512 జీబీ వేరియంట్ రూ. 33,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ పై సెలెక్టెడ్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ పై రూ. 2,000 తగ్గింపు ఆఫర్ ని పోకో అందించింది. జూలై 1వ తేదీ ఈ ఫోన్ ఫస్ట్ సేల్ మొదలవుతుంది.
ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ ఈ ఫోన్ వైపు ఆకర్షించే వాటిలో మొదటి విషయం అని చెప్పాలి. ఎందుకంటే, పోకో ఈ ఫోన్ ను క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ ఫాస్ట్ చిప్ సెట్ Snapdragon 8s Gen 4 తో అందించింది. ఇది 21 లక్షల AnTuTu స్కోర్ అందించే ఫాస్ట్ చిప్ సెట్. ఈ ఫోన్ మరింత గొప్ప పెర్ఫార్మెన్స్ అందించే విధంగా 12 జీబీ LPDDR5X ఫిజికల్ మరియు 24 జీబీ టర్బో తో టోటల్ 36 జీబీ పవర్ ఫుల్ ర్యామ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫీచర్స్ తో ఈ ఫోన్ గొప్ప పెర్ఫార్మన్స్ అందించే అవకాశం ఉంటుంది.
పోకో ఈ ఫోన్ యూ గేమింగ్ కోసం ప్రత్యేకమైన ఫీచర్స్ తో అందించింది. ఈ ఫీచర్స్ తో ఈ ఫోన్ గేమర్స్ కి మంచి ఆప్షన్ అయ్యేలా చేస్తుంది. ఇందులో Wild Boost 4.0 ఫీచర్ అందించింది. ఈ ఫీచర్ తో ఈ ఫోన్ స్థిరమైన హై ఫ్రేమ్ రేట్ మరియు స్థిరమైన బ్రైట్నెస్ లెవల్స్ అందిస్తుంది. గేమింగ్ సమయంలో పెర్ఫార్మెన్స్ తో పాటు ఈ రెండు ఫీచర్స్ కూడా అవసరమే.
ఈ పోకో స్మార్ట్ ఫోన్ 6.83 ఇంచ్ AMOLED స్క్రీన్ ను ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, Dolby Vision సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్, వెట్ టచ్ మరియు గ్లోవ్ సెన్సిటివ్ వంటి ఫీచర్స్ తో వస్తుంది. ఈ ఫీచర్స్ తో గొప్ప ఎంటర్టైన్మెంట్ మరియు సూపర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అందిస్తుంది.
ఈ ఫోన్ డిజైన్ కూడా మిమ్మల్ని ఆకర్షించే ఫీచర్స్ లో ఒకటిగా ఉంటుంది. ఎందుకంటే, పోకో ఈ ఫోన్ ను ఎక్కువ ఒత్తిడిని కూడా తట్టుకునే మెటల్ మిడిల్ ఫ్రేమ్ మరియు రెండు వైపులా ప్రీమియం లుక్ అందించే గ్లాస్ డిజైన్ తో అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ రక్షణ కోసం రెండు వైపులా గొరిల్లా గ్లాస్ 7i ని అందించింది. అంటే, ఈ ఫోన్ డిజైన్ పరంగా అందంగా మరియు ఒత్తిడి తట్టుకునేలా పటిష్టమైన మెటీరియల్ తో అందించబడింది. అంతేకాదు, IP66, IP68 మరియు IP69 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.
ఈ ఫోన్ కెమెరా పరంగా కూడా మంచి సెటప్ కలిగి ఉందని పోకో చెబుతోంది. ఇందులో, 50MP Sony OIS మెయిన్ మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ లో ముందు 20MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ HDR10+ వీడియో మరియు 60fps వద్ద 4K వీడియో రికార్డ్ తో పాటు అనేకమైన AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: iQOO Z10 Lite 5G: ఒక్కరోజు డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ మొదలు.!
ఈ ఫోన్ ఇన్ని ఫీచర్స్ కలిగి ఉన్నా కూడా ఈ ఫోన్ లో మంచి బ్యాటరీ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఈ విషయంలో కూడా పోకో సరైన నిర్ణయం తీసుకుంది. ఈ ఫోన్ లో భారీ 7550 mAh బ్యాటరీ మరియు ఈ బ్యాటరీ ని వేగంగా ఛార్జ్ చేసే 90W టర్బో ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. దీనితో పాటు బ్లూటూత్ TWS బడ్స్, హెడ్ ఫోన్ మరియు మరింకేదైనా డివైజ్ ని వేగంగా ఛార్జ్ చేయడానికి వీలుగా 22.5 రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించడం విశేషం.
ఈ పైన తెలిపిన ఐదు ప్రత్యేకతలు లేదా ఫీచర్లు ఈ ఫోన్ వైపు ఆకర్షించేలా ఉంటాయని పోకో తెలిపింది.