Poco F6 Limited Edition Deadpool and wolverine leaked online
Poco F6 Limited Edition: ఇండియన్ మార్కెట్ లో పోకో ఇటీవల విడుదల చేసిన పోకో పవర్ ఫుల్ మిడ్ రేంజ్ ఫోన్ లిమిటెడ్ ఎడిషన్ ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ అప్ కమింగ్ లిమిటెడ్ ఎడిషన్ ప్రత్యేకమైన కలర్ మరియు డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ సినిమా కోసం అందించే ఎడిషన్ గా ఉంటుంది. ఈ అప్ కమింగ్ ఫోన్ ను కొత్త కలర్ మరియు డెడ్ పూల్ గుర్తు తో తీసుకు వస్తుందని ప్రముఖ లీక్ స్టర్, ఈ ఫోన్ బ్యాక్ ప్యానల్ ఇమేజ్ ను కూడా లీక్ చేశారు.
2024 మే నెల చివరిలో పోకో ఎఫ్ 6 స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో పోకో విడుదల చేసింది. ఈ ఫోన్ ను 30 వేల బడ్జెట్ ఆకట్టుకునే ఫీచర్స్ తో అందించింది. అయితే, ఈ ఫోన్ విడుదలైన రెండు నెలల తర్వాత ఈ ఫోన్ లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ను తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది.
పోకో అధికారిక X అకౌంట్ నుండి ఈ ఫోన్ గురించి కొత్త హింట్ మాత్రమే ఇచ్చింది. అయితే, పోకో తీసుకు రాబోతునట్లు చెబుతున్న పోకో ఎఫ్ 6 x డెడ్ పూల్ x వోల్వరిన్ స్పెషల్ ఎడిషన్ ఫోన్ బ్యాక్ ప్యానల్ ఇమేజ్ ఇప్పుడు ఆన్లైన్ లో లీక్ చేశారు. ప్రముఖ లీక్ స్టర్ యోగేష్ బ్రార్ తన x అకౌంట్ నుండి ఈ పోకో అప్ కమింగ్ ఫోన్ రెండర్ ఇమేజ్ ను పోస్ట్ చేశారు.
ఈ లీకైన ఫోన్ ఇమేజ్ ప్రకారం, ఈ ఫోన్ కొత్త డెడ్ పూల్ రెడ్ కలర్ లో వస్తుంది అని అర్థం అవుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ కలిగిన ఉన్న రింగ్ ఫ్లాష్ పైన డెడ్ పూల్ చిత్రం కూడా ముద్రించబడి ఉంటుంది. అలాగే, కెమెరా కి పక్కన పోకో బ్రాడింగ్ మరియు క్రింద స్పెషల్ ఎడిషన్ అని కూడా రాసి ఉంటుంది. ఈ స్పెషల్ ఎడిషన్ ఫోన్ మధ్య భాగంలో రెండు కత్తులు పట్టుకుని ఉన్న డెడ్ పూల్ హీరో బొమ్మ కూడా ఉన్నట్లు కూడా కన్పిస్తోంది. ఈ పోకో ఎఫ్ 6 స్పెషల్ ఎడిషన్ ఫోన్ స్పెసిఫికేషన్ లలో ఎటువంటి మార్పులు ఉండవని భావిస్తున్నారు.
Also Read: Realme 13 Pro+ 5G: లాంచ్ కంటే వారం ముందే ఆన్లైన్ లో లీకైన కంప్లీట్ ఫీచర్స్.!
పోకో ఎఫ్ 6 స్మార్ట్ ఫోన్ ను Snapdragon 8s Gen 3 చిప్ సెట్ మరియు 60 fps వద్ద HDR 10+ సపోర్ట్ తో 4K UHD వీడియోలను షూట్ చేయగల కెమెరా తో అందించింది. ఈ ఫోన్ ను 90W ఫాస్ట్ ఛార్జ్ కలిగిన 5000mAh బ్యాటరీ సెటప్, 12GB LPDDR5X ర్యామ్, Dolby Vision సపోర్ట్ కలిగిన స్క్రీన్ మరియు Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు వంటి భారీ ఫీచర్స్ తో 30 వేల బడ్జెట్ లో అందించింది.