Poco F6 Launch confirmed globally
Poco F6 Launch: పవర్ ఫుల్ మరియు ప్రీమియం ఫీచర్స్ కలిగి వుండే పోకో సిరీస్ గా పేరొందిన F Series నుంచి కొత్త ఫోన్ ను విడుదల చేస్తోంది. అదే, Poco F6 మరియు ఈ ఫోన్ ను పోకో ఎఫ్ 5 నెక్స్ట్ జనరేషన్ ఫోన్ గా తీసుకు వస్తుంది. ఈ ఫోన్ ను గ్లోబల్ మార్కెట్ తో పాటుగా ఇండియాలో కూడా చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది.
మే 23వ తేదీ పోకో ఎఫ్ 6 స్మార్ట్ ఫోన్ యొక్క గ్లోబల్ లాంచ్ నిర్వహిస్తున్నట్లు పోకో తెలిపింది. ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్ ఇండియాలో మే 23వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు మొదలవుతుంది. ఈ ఫోన్ లాంచ్ ఈవెంట్ కోసం Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది.
పోకో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పోకో ఎఫ్ 6 గురించి కంపెనీ ప్రస్తుతానికి ఎటువంటి వివరాలను అందించ లేదు. అయితే, ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా కొన్ని వివరాలు కనిపిస్తున్నాయి. ఇందులో ఈ ఫోన్ డిజైన్, కెమెరా మరియు కెమెరా ఫీచర్స్ ఉన్నాయి.
ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ పోకో ఎఫ్ 5 స్మార్ట్ ఫోన్ మాదిరి డిజైన్ ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ ఫోన్ మరింత నాజూకుగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందులో రైట్ సైడ్ లో పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ కనిపిస్తున్నాయి.
Also Read: Google Pixel 8a: భారీ ఆఫర్లతో గూగుల్ కొత్త ఫోన్ ఫస్ట్ సేల్.!
వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా OIS సపోర్ట్ ఉన్నట్లు ఇమేజ్ ద్వారా తెలిపింది. అంతేకాదు, ఇందులో రింగ్ ఆకారంలో ఉన్న డ్యూయల్ ఫ్లాష్ రింగ్ కూడా వుంది. ఈ ఫోన్ గ్రే కలర్ లో కనిపిస్తోంది మరియు పెద్ద కెమెరా రింగ్ డిజైన్ తో ఆకర్షణీయంగా కన్పిస్తోంది.
అయితే, పోకో ఎఫ్ 5 స్పెక్స్ తో ఈ ఫోన్ ను స్పెక్స్ ను అంచనా వేస్తే, ఈ ఫోన్ లో Dolby Vision సపోర్ట్ కలిగిన AMOLED డిస్ప్లే, Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉండవచ్చు. అలాగే, ఈ ఫోన్ లో కొత్త మరియు వేగవంతమైన ప్రోసెసర్ మరియు వేగవంతమైన ఛార్జ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంటుంది.