Poco F6 Deadpool స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ బాక్స్ తో మరియు వివరాలు లీక్.!

HIGHLIGHTS

Poco F6 Deadpool స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ వస్తోంది

ఫోన్ బాక్స్ మరియు వివరాలు ఇప్పుడు నెట్టింట్లో రివీల్ అయ్యాయి

ఈ ఫోన్ కొత్త డెడ్ పూల్ కలర్ మరియు ఇమేజ్ తో ఆకట్టుకుంటోంది

Poco F6 Deadpool స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అప్ కమింగ్ ఫోన్ బాక్స్ మరియు వివరాలలు ఇప్పుడు నెట్టింట్లో రివీల్ అయ్యాయి. ఈ ఫోన్ కొత్త డెడ్ పూల్ కలర్ మరియు ఇమేజ్ తో ఆకట్టుకుంటోంది. రెండు నెలల క్రితం ఇండియాలో మార్కెట్ లో పోకో విడుదల చేసిన మిడ్ రేంజ్ పవర్ ఫుల్ ఫోన్ పోకో ఎఫ్ 6 స్మార్ట్ ఫోన్ యొక్క స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ గా ఈ ఫోన్ తీసుకొస్తోంది.

Poco F6 Deadpool స్పెషల్ ఎడిషన్

పోకో ఎఫ్ 6 డెడ్ పూల్ స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ ను త్వరలో లాంచ్ చేస్తుందని పోకో ఇండియా కంట్రీ హెడ్ హిమాన్షు టండన్ అనౌన్స్ చేశారు. అంతేకాదు, ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క బాక్స్ మరియు ఇమేజ్ తో ఈ ఫోన్ వివరాలను తన అధికారిక X అకౌంట్ నుండి రివీల్ చేశారు. మార్వెల్ స్టూడియో తీసుకు వస్తున్న డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ సినిమా కోసం ఈ పోకో ఎఫ్ 6 డెడ్ పూల్ స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ ను తీసుకు వస్తున్నారు. ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. ఈ ఫోన్ కూడా అదే రోజు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉండవచ్చు.

ఇక ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ ఫోన్ వివరాల్లోకి వెళితే, ఈ కొత్త ఫోన్ కొత్త డెడ్ పూల్ థీమ్ రెడ్ కలర్ లో కనిపిస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ లో వెనుక డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ ఫోటో ను కలిగి ఉంటుంది. ఇది స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి కొన్ని యూనిట్స్ మాత్రమే అందుబాటులో ఉండవచ్చు. అయితే, ఈ ఫోన్ స్పెక్స్ లేదా ఫీచర్స్ లో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు.

Poco F6 : ఫీచర్లు

పోకో ఈ స్మార్ట్ ఫోన్ ను 1.5K రిజల్యూషన్, Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ కలిగిన AMOELD స్క్రీన్ తో అందించింది. ఈ ఫోన్ ను పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ అందించగల Snapdragon 8s Gen 3 ప్రోసెసర్ మరియు జతగా 12GB ర్యామ్ తో అందించింది. ఈ ఫోన్ 256GB మరియు 512GB స్టోరేజ్ వేరియంట్స్ లో కూడా లభిస్తుంది.

Also Read: Flipkart Sale నుంచి సగం ధరకే లభిస్తున్న JBL Soundbar ఆఫర్ పై ఒక లుక్కేయండి.!

పోకో ఎఫ్ 6 స్మార్ట్ ఫోన్ 60 fps వద్ద HDR 10+ 4K వీడియోలు షూట్ చెయ్యగల డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 20MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీతో కూడా ఉంటుంది. పోకో ఎఫ్ 6 ఫోన్ రూ. 27,999 ప్రారంభ ధరలో లభిస్తుంది. అయితే, పోకో ఎఫ్ 6 డెడ్ పూల్ స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ రేటు ఎంత ఉంటుందో చూడాలి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :