Poco F4 5G భారీ డిస్కౌంట్ అఫర్ తో లభిస్తోంది..!!

HIGHLIGHTS

POCO F4 5G ఇప్పుడు భారీ డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తోంది

ఈ స్మార్ట్ ఫోన్ ను Flipkart నుండి భారీ డిస్కౌంట్ అఫర్ తో కొనుగోలు చేయవచ్చు

ఈ స్మార్ట్ ఫోన్ Dolby Vision డిస్ప్లే మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో వస్తుంది

షియోమీ ఇండియాలో భారీ ఫీచర్లతో విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ POCO F4 5G  ఇప్పుడు భారీ డిస్కౌంట్ ఆఫర్లతో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను Flipkart నుండి భారీ డిస్కౌంట్ అఫర్ తో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ Dolby Vision డిస్ప్లే మరియు Dolby Atmos సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది మాత్రమే కాదు, OIS సపోర్ట్ కలిగిన 64MP ట్రిపుల్ రియర్ కెమెరాతో వంటి మరిన్ని గొప్ప ఫీచర్లతో లాంచ్ చెయ్యబడింది. ఈ ఫోన్ పైన అఫర్ చేస్తున్న డిస్కౌంట్ అఫర్ వివరాలను క్రింద చూడవచ్చు.   

POCO F4 5G: ధర మరియు ఆఫర్లు

పోకో ఈ స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్స్ లో అందించింది. 

POCO F4 5G (6GB + 128GB) ధర: రూ.27,999

POCO F4 5G (8GB + 128GB) ధర: రూ.29,999

POCO F4 5G (12GB + 256GB) ధర: రూ.33,999

ఇక ఈ ఫోన్ పైన అందించిన డిస్కౌంట్ ఆఫర్ల విషయానికి వస్తే, SBI లేదా HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ అప్షన్లతో ఈ ఫోన్ కొనేవారికి 3,000 రూపాయల భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, ప్రీపెయిడ్ అప్షన్ ద్వారా చెల్లించే వారు 1,000 రూపాయల డిస్కౌంట్ ని పొందవచ్చు. అంటే, డిస్కౌంట్ అఫర్ తో ఈ ఫోన్ కొనేవారు కేవలం 24,999 రూపాయల పార్రంభం ధరకే ఈ ఫోన్ ను పొందవచ్చు.  

POCO F4 5G: స్పెక్స్ & ఫీచర్స్

POCO F4 5G స్మార్ట్ ఫోన్ 6.67 ఇంచ్ డిస్ప్లేని  FHD+  రిజల్యూషన్ తో కలిగివుంటుంది. ఈ డిస్ప్లే Dolby Vision సపోర్ట్ కలిగిన E4 సూపర్ AMOLED డిస్ప్లే మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ డిస్ప్లే సెల్ఫీ కెమెరా కోసం మధ్యలో పంచ్-హోల్ డిజైన్ తో కలిగి వుంటుంది. అధనంగా, ఈ డిస్ప్లే 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు MEMC టెక్నాలజీతో కూడా వుంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను అందిస్తుంది.

ఈ ఫోన్ గరిష్టంగా 3.2GHz క్లాక్ స్పీడ్ అందించ గల క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ కలిగి ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 650 GPU తో పనిచేస్తుంది. ఇది 12GB LPDDR5 RAM మరియు 256GB UFS 3.1 ROM వరకూ స్టోరేజ్ తో వస్తుంది. అంతేకాదు, ఇది ఎర్గోనామిక్ ఫ్లాట్ సైడ్స్ తో ప్రీమియం డిజైన్ తో కూడా ఉన్నట్లు పోకో తెలిపింది.

పోకో F4 5G కెమెరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఇందులో, ఆప్టిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) తో 64MP మైన్ కెమెరాని జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ కలిగివుంటుంది. అలాగే, ఈ ఫోన్ లో కెమెరాలు బ్లర్ ను తగ్గించే విధ్దంగా రూపొందించబడినట్లు కూడా చెబుతోంది. ఈ ఫోన్ ను వేగంగా చల్లబర్చడానికి 7 లేయర్ గ్రాఫైట్ షీట్స్ కలిగిన 3112mm వేపర్ ఛాంబర్ ను కూడా కలిగి వుంది. ఈ ఫోన్ 4500mAh బ్యాటరీని 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :