POCO F4 5G స్మార్ట్ ఫోన్ యొక్క గ్లోబల్ డెబ్యూట్ ను జూన్ 23 న నిర్వహిస్తునట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క గోబర్ లాంచ్ కార్యక్రమం జూన్ 23 న సాయంత్రం 5 గంటల 30 నిముషాలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ యొక్క టీజర్ ను కూడా షియోమీ విడుదల చేసింది మరియు ఈ ఫోన్ కోసం అమెజాన్ ప్రత్యేకమైన మైక్రోసైట్ పేజ్ ను కూడా కేటయించింది. అంతేకాదు, ఈ ఫోన్ యొక్క కీలకమైన వివరాలను కూడా అమెజాన్ మైక్రోసైట్ పేజ్ ద్వారా వెల్లడించింది. ఈ ఫోన్ ను పోకో ఒక రేంజ్ ఫీచర్లతో తీసుకువస్తునట్లు కనిపిస్తోంది.
మరో రెండు రోజుల్లో విడుదల కానున్న POCO F4 5G స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ ను కంపెనీ వెల్లడించింది. దీని ద్వారా, ఈ స్మార్ట్ ఫోన్ Dolby Vision సపోర్ట్ కలిగిన E4 సూపర్ AMOLED డిస్ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటుగా సెల్ఫీ కెమెరా కోసం మధ్యలో పంచ్-హోల్ డిజైన్ తో కలిగి వుంటుంది. అధనంగా, ఈ డిస్ప్లే 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు MEMC టెక్నాలజీతో కూడా వుంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.
ఈ ఫోన్ గరిష్టంగా 3.2GHz క్లాక్ స్పీడ్ అందించ గల క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ కలిగి ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 650 GPU తో పనిచేస్తుంది. ఇది 12GB LPDDR5 RAM మరియు 256GB UFS 3.1 ROM వరకూ స్టోరేజ్ తో వస్తుంది. అంతేకాదు, ఇది ఎర్గోనామిక్ ఫ్లాట్ సైడ్స్ తో ప్రీమియం డిజైన్ తో కూడా ఉన్నట్లు తెలిపింది.
పోకో F4 5G కెమెరాల విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. ఇందులో, ఆప్టిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) తో 64MP మైన్ కెమెరాని కలిగివుంటుంది. అలాగే, ఈ ఫోన్ లో కెమెరాలు బ్లర్ ను తగ్గించే విధ్దంగా రూపొందించబడినట్లు కూడా చెబుతోంది. ఈ ఫోన్ ను వేగంగా చల్లబర్చడానికి 7 లేయర్ గ్రాఫైట్ షీట్స్ కలిగిన 3112mm వేపర్ ఛాంబర్ ను కూడా కలిగి వుంది.
పోకో ప్రస్తుతానికి ఈ వివరాలను అధికారికంగా వెల్లడించింది మరియు లాంచ్ సమయానికి మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం వుంది.