పోకో F3 చాలా సన్నని మరియు సొగసైన డిజనుతో లాంచ్

Updated on 24-Mar-2021
HIGHLIGHTS

పోకో F3 చాలా సన్నగా వుంటుంది

సొగసైన డిజైనుతో ఉంటుంది

Poco F3 వేగవంతమైన క్వాల్కమ్ చిప్ సెట్ తో విడుదలయ్యింది. పోకో యొక్క ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ తో పాటుగా పోకో X3 ప్రో ను కూడా ప్రకటించింది. పోకో F3 స్నాప్ డ్రాగన్ 870 ఆక్టా కోర్ ప్రాసెసర్ మరియు లేటెస్ట్ ఫీచర్లతో తీసుకురాబడింది. పోకో F3 స్మార్ట్ ఫోన్ చాలా సన్నని మరియు సొగసైన డిజనుతో కంపెనీ లాంచ్ చేసింది.

POCO F3: ప్రత్యేకతలు

ఈ POCO F3 స్మార్ట్ ఫోన్ ఒక 6.7-అంగుళాల Full HD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ AMOLED డిస్ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటుగా సెల్ఫీ కెమెరా కోసం మధ్యలో పంచ్-హోల్ డిజైన్ తో కలిగి వుంటుంది. ఈ స్క్రీన్ యొక్క రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 6 తో వస్తుంది. ఈ పోకో ఫోన్ కేవలం 196 గ్రాముల బరువుతో 7.8 మిమీ మందంతో చాలా సన్నని మరియు సొగసైన డిజైనుతో ఉంటుంది.

ఈ ఫోన్ గరిష్టంగా 3.2GHz క్లాక్ స్పీడ్ అందించ గల క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ కలిగి ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 650 GPU తో పనిచేస్తుంది. ఇది 8GB RAM మరియు 256GB వరకూ స్టోరేజ్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI 12 పై పోకో లాంచర్ తో నడుస్తుంది.

పోకో F3 వెనుక భాగంలో ప్రాధమిక 48MP కెమెరాని , 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాని, 5MP మాక్రో కెమెరాని మరియు 2MP డెప్త్ సెన్సార్ తో కలిగివుంది. ముందు భాగంలో, 20 MP సెల్ఫీ కెమెరాని పంచ్ హోల్ లో కలిగి ఉంది. ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు  మరియు 4,520 ఎమ్ఏహెచ్ బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఇక ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ 6GB + 128GB వేరియంట్ EUR 349 ధరతో ప్రకటించింది.  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :