POCO F3 GT: పోకో కొత్త స్మార్ట్ ఫోన్ తెస్తోంది

Updated on 28-May-2021
HIGHLIGHTS

పోకో కొత్త స్మార్ట్ ఫోన్ తెస్తోంది

POCO F3 GT నెక్స్ట్ రాబోయే పోకో స్మార్ట్ ఫోనుగా టీజింగ్

టీజింగ్ చాలా ఆసక్తికరంగా కూడా వుంది

పోకో కొత్త స్మార్ట్ ఫోన్ తెస్తోంది. POCO F3 GT నెక్స్ట్ రాబోయే పోకో స్మార్ట్ ఫోనుగా టీజింగ్ మొదలుపెట్టింది. పోకో ట్విట్టర్ అధికారిక అకౌంట్ ద్వారా అందించిన టీజింగ్ చాలా ఆసక్తికరంగా కూడా వుంది. ఈటీజర్ లో POCO F3 GT ఎలా ఉండబోతుంది అనే దానిపైన ఒక అవగాహనా కూడా అందించింది. అంతేకాదు, చాలా కాలంగా ఎదురు చూస్తున్న వివరాలు మీరు ఊహించనంత దగ్గరగా ఉన్నాయని దీని గురించి టీజింగ్ చేస్తోంది.

అంటే, చాలా తొందరగానే ఈ POCO F3 GT స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తానని పోకో చెప్పకనే చెబుతోంది. కొత్త తరహాలో ఎక్కవ ఫీచర్లతో తక్కువ స్మార్ట్ ఫోన్ లను అంధిస్తున్న సంస్థగా POCO ఇప్పటికే పేరు సంపాదించుకుంది. ఇటీవలే, ప్రపంచ వ్యాప్తంగా చాలా తక్కువ ధరకే POCO M3 Pro 5G విడుదల చేసి ప్రపంచ మార్కెట్ కొనుగోలుధారుల దృష్టిని ఆకర్షించింది.

 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :