పోకో నుండి మరొక సంచలన స్మార్ట్ ఫోన్ ఇండియాలోకి రాబోతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే వస్తున్న కధనాలు మరియు టిప్స్టర్ ల ద్వారా బయటికి వచ్చిన వివరాల ప్రకారం POCO F2 మంచి ఫీచర్లతో ఇండియాలో ప్రవేశించే అవకాశం వుంది. కొత్త సంవత్సరంలో తన కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి పోకో చెబుతున్న తీరు మరియు షోషల్ మీడియాలో విడుదల చేసిన ఫ్లాష్ బ్యాక్ వీడియోలను పరీక్షిస్తే, అతి త్వరలోనే పోకో తన కొత్త స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో లాంచ్ చేయవచ్చని అర్ధమవుతుంది.
పోకో F2 కోసం తన షోషల్ మీడియా హ్యాండిల్స్ లో విడుదల చేసిన టీజింగ్ వీడియో ద్వారా POCO F2 స్మార్ట్ ఎటువంటి ఫీచర్లను తీసుకురానుందనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. ఈ వీడియోలో రానున్న ఈ స్మార్ట్ ఫోన్ గురించి ఎటువంటి వివరాలను వెల్లడించనప్పటికీ కొన్ని నివేదికల ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ వేగవంతమైన మరియు లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 732G ప్రొసెసర్ శక్తితో అడుగుపెట్టవచ్చని తెలుస్తోంది.
అంతేకాదు, 4250 mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటుగా 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే కూడా వుండవచ్చనే రూమర్లు చాలానే నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ రూమర్ల గురించి లేదా ఈ ఫోనులో అందించనున్న ఎటువంటి ఫీచర్ల గురించి కూడా పోకో ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటన చేయలేడు. కానీ, ఇప్పటి వరకూ పోకో అందించిన స్మార్ట్ ఫోన్ల తీరును దృష్టిలో పెట్టుకుంటే మాత్రం POCO F2 ను ఎక్కువ ఫీచర్లతో విడుదల్ చెయ్యవచు.