Oppo Reno 8: భారీ ఫీచర్లతో మిడ్ రేంజ్ ధరలో లాంచ్.!

Updated on 19-Jul-2022
HIGHLIGHTS

Oppo Reno 8 స్మార్ట్ ఫోన్ ను భారీ ఫీచర్లతో మిడ్ రేంజ్ ధరలో లాంచ్ చేసిన ఒప్పో

Oppo Reno 8 ను మంచి స్లీక్ డిజైన్ తో అందించింది

ఈ ఫోన్ మీడియాటెక్ పవర్ ఫుల్ ప్రాసెసర్ Dimensity 1300 తో పనిచేస్తుంది

Oppo Reno 8 స్మార్ట్ ఫోన్ ను భారీ ఫీచర్లతో మిడ్ రేంజ్ ధరలో లాంచ్ చేసిన ఒప్పో. ఈ స్మార్ట్ ఫోన్ ను పవర్ ఫుల్ ప్రాసెసర్, ఆకట్టుకునే కెమెరా ఫీచర్లతో పాటుగా మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో ఒప్పో తీసుకువచ్చింది. ఒప్పో రెనో 8 డిజైన్ ను కూడా చూడగానే ఆకర్షించే విధంగా వుండేలా జాగ్రత్త తీసుకుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం మిడ్ రేంజ్ ధరలో హెవీ స్పెక్స్ మరియు ఫీచర్లతో అందించడం విశేషం. మరి ఇంకెదుకు ఆలశ్యం ఈ లేటెస్ట్ ఒప్పో స్మార్ట్ ఫోన్ పూర్తి వివరాలు తెలుసుకుందామా.

Oppo Reno 8: స్పెక్స్

Oppo Reno 8 ను మంచి స్లీక్ డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ 6.43 ఇంచ్ AMOLED డిస్ప్లేని FHD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ తో ఆకలిగి వుంది. ఈ స్క్రీన్ మరింత పటిష్టంగా ఉంచేందుకు గొరిల్లా గ్లాస్ 5 రక్షణను కూడా అందించింది. ఈ ఫోన్ మీడియాటెక్ పవర్ ఫుల్ ప్రాసెసర్ Dimensity 1300 తో పనిచేస్తుంది.  ఈ పవర్ ఫుల్ ప్రాసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కూడా ఉన్నాయి. ఒప్పో రెనో 8 స్మార్ట్ ఫోన్ షిమ్మర్ గోల్డ్ మరియు షిమ్మర్ బ్లాక్ అనే రెండు కలర్ అప్షన్ లలో లభిస్తుంది. 

ఇక కెమెరాల పరంగా, ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ను అందించింది. ఇందులో, 50MP SonyIMX766 ప్రధాన కెమెరాకి జతగా 8MP వైడ్ యాంగిల్ కెమెరా మరియు 2MP మ్యాక్రో కెమెరా ఉన్నాయి. ఈ కెమెరాతో 30fps వద్ద 4K వీడియోలను చిత్రీకరించ్చని ఒప్పో తెలిపింది. అలాగే, సెల్ఫీల కోసం 32MP SonyIMX709 సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ అత్యంత వేగవంతంగా ఛార్జ్ చేసే సత్తా కలిగిన 80W  SuperVOOC సపోర్ట్ కలిగిన 4,500mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది.

Oppo Reno 8: ధర మరియు లాంచ్ ఆఫర్లు

ఇక ఒప్పో రెనో 8 యొక్క ధర వివరాల్లోకి వెళితే, ఈ స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో రూ.29,999 ధరతో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ పైన లాంచ్ ఆఫర్లను కూడా ఒప్పో జత చేసింది. ఒప్పో రెనో 8 ను SBI, ICICI మరియు HDFC  బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్స్ తో కొనేవారికి ఫ్లాట్ 3,000 రూపాయల డిస్కౌంట్ అఫర్ ను కూడా అందించింది. అలాగే, Bank Of Baroda క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి 3,000 తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ జూలై 24 నుండి విక్రయించబడుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :