Oppo Reno 14 Series ఇండియా లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ ప్రకటించిన ఒప్పో.!

Updated on 27-Jun-2025
HIGHLIGHTS

Oppo Reno 14 Series 5G స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది

ఈ అప్ కమింగ్ సిరీస్ స్మార్ట్ ఫోన్లను ట్రావెల్ ఇన్స్పైర్డ్ డిజైన్ తో తీసుకు వచ్చింది

అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ రెండు ప్లాట్ ఫామ్స్ కూడా ప్రత్యేకమైన టీజర్ పేజీలు అందించాయి

Oppo Reno 14 Series 5G స్మార్ట్ ఫోన్ సిరీస్ కోసం ఇప్పటి వరకు ‘కమింగ్ సూన్’ ట్యాగ్ తో టీజింగ్ చేసిన ఒప్పో, ఎట్టకేలకు ఈరోజు ఈ ఫోన్ లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఒప్పొ ఈ అప్ కమింగ్ సిరీస్ స్మార్ట్ ఫోన్‌లను ట్రావెల్ ఇన్‌స్పైర్ డిజైన్ తో తీసుకొచ్చింది. ఒప్పో సరికొత్తగా విడుదల చేయనున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్లు ఏమిటో చూద్దామా.

Oppo Reno 14 Series : లాంచ్ డేట్ ఏమిటి?

ఒప్పో రెనో 14 సిరీస్ స్మార్ట్ ఫోన్ ను జూలై 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయడానికి డేట్ మరియు టైం ఫిక్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ కోసం అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ రెండు ప్లాట్ ఫామ్స్ కూడా ప్రత్యేకమైన టీజర్ పేజీలు అందించాయి. ఈ స్మార్ట్ ఫోన్ కలిగిన ప్రత్యేకతలు ఈ ఫోన్ నుంచి టీజింగ్ చేస్తున్నాయి.

Oppo Reno 14 Series : ఫీచర్లు

ఒప్పో రెనో 14 సిరీస్ నుంచి లాంచ్ చేసే స్మార్ట్ ఫోన్లు గ్లోయింగ్ పర్ల్ డిజైన్ కలిగి ఉంటాయి. అంతేకాదు, ఈ ఫోన్స్ సిల్కీ స్మూత్ వెల్వెట్ గ్లాస్ కలిగిన ఇండస్ట్రీ ఫస్ట్ ఫోన్స్ గా ఉంటాయి. ఈ ఫోన్ ఏరో స్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ మరియు వన్ పీస్ స్కల్ప్టెడ్ గ్లాస్ వంటి ప్రీమియం డిజైన్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 16 లక్షలకు పైగా AnTuTu స్కోర్ కలిగిన మీడియాటెక్ Dimensity 8450 ఆక్టా కోర్ చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఈ చిప్ సెట్ తో జతగా 12 జిబీ ర్యామ్ మరియు 512 జిబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.

ఒప్పో రెనో 14 సిరీస్ స్మార్ట్ ఫోన్లు HDR 10+ సపోర్ట్ మరియు FHD+ రిజల్యూషన్ కలిగిన 6.83 ఇంచ్ OLED స్క్రీన్ లాగి ఉంటాయి. ఈ స్క్రీన్ స్పాలాష్ టచ్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కలర్ OS సాఫ్ట్ వేర్ జతగా గూగుల్ జెమినీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

కెమెరా పరంగా ఒప్పో రెనో 14 సిరీస్ స్మార్ట్ ఫోన్లు గొప్పగా ఉంటాయని ఒప్పో చెబుతోంది. ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్ సెన్సార్, 50MP టెలి ఫోటో (3.5x ఆప్టికల్ జూమ్) మరియు 50MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. అలాగే, ఈ ఫోన్ లలో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లోని అన్ని కెమెరాలు కూడా 4K HDR క్లారిటీ కలిగి ఉంటాయని ఒప్పో ప్రకటించింది. అంటే, అన్ని కెమెరాలతో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ అందించింది.

Also Read: Flipkart Sale నుంచి బిగ్ డిస్కౌంట్ ఆఫర్ తో 27 వేలకే 55 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!

ఈ ఫోన్ పర్ల్ వైట్ మరియు టైటానియం గ్రే రెండు రంగుల్లో లాంచ్ అవుతుంది. ఈ వీటిలో పర్ల్ వైట్ 7.58 mm మందంతో మరియు టైటానియం గ్రే 7.48 mm మందంతో చాలా సన్నగా ఉంటుంది. ఈ ఫోన్ మరిన్ని ఫీచర్లు కూడా ఒప్పో త్వరలోనే వెల్లడిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :