ఒప్పో తన కొత్త స్మార్ట్ ఫోన్ ఒప్పో కే 10 ను బడ్జెట్ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో ప్రకటించింది. ఈ సరికొత్త ఒప్పో స్మార్ట్ ఫోన్ 15 వేల రూపాయల సెగ్మెంట్ లో వచ్చింది. ఈ ఫోన్ 50MP ట్రిపుల్ రియర్ కెమెరా మరియు 33W SuperVOOC ఛార్జ్ సపోర్ట్ వంటి మరిన్నిఫీచర్లతో వచ్చింది.ముఖ్యంగా, ఈ ఫోన్ చూడగానే ఆకర్షించే డిజైన్ ను కలిగి వుంది. ఒప్పో లెటస్ట్ గా తీసుకువచ్చిన ఈ కొత్త ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు ఈ క్రింద చూడవచ్చు.
ఒప్పో కే10 స్మార్ట్ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ (6GB RAM +128GB) ధర రూ.14,990 మరియు ఫోన్ యొక్క 8GB RAM మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,990. ఈ స్మార్ట్ ఫోన్ మార్చి 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు Flipkart మరియు కంపెనీ వెబ్సైట్ oppo.com నుండి మొదటిసారిగా సేల్ కి వస్తుంది.
ఒప్పో కే10 స్మార్ట్ ఫోన్ పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.59 స్క్రీన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగివుంటుంది. ఈ డిస్ప్లేలో అందించిన పంచ్ హోల్ కటౌట్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని కలిగివుంది. ఈ సెల్ఫీ కెమెరా రాత్రయినా పగలైనా వెలుతురులో సంభంధం లేకుండా మంచి ఫోటోలు తియ్యగలదని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్ 6nm ప్రోసెసర్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రోసెసర్ కి జతగా 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో పనిచేస్తుంది మరియు జతగా ఎక్స్ టెండెడ్ ర్యామ్ ఫీచర్ కూడా వుంది.
ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP మైన్ కెమెరాకి జతగా 2ఎంపి డెప్త్ సెన్సార్ మరియు 2ఎంపి మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా ColorOS 11.1 లో పనిచేస్తుంది. ఈ ఒప్పో కే10 ఫోన్ లో 33W SuperVOOC ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బిగ్ బ్యాటరీ కూడా వుంది. ఈ ఫోన్ బ్లూ ఫ్లేమ్ మరియు బ్లాక్ రెండు కార్బన్ కలర్ లలో లభిస్తుంది.