OPPO K14x 5G: భారీ ఆఫర్స్ తో మొదలైన ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్ సేల్.!

Updated on 16-Feb-2026
HIGHLIGHTS

లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఒప్పో కె 14x ఈరోజు నుంచి భారీ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది

ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లో అండర్ రూ. 15,000 రూపాయల ఫోన్ గా అడుగుపెట్టింది

ఈ ఫోన్ పై అందించిన బిగ్ డీల్స్ తో మంచి ఆఫర్ ప్రైస్ లో లభిస్తుంది

OPPO K14x 5G: ఒప్పో గత వారం ఇండియాలో విడుదల చేసిన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఒప్పో కె 14x స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి భారీ ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లో అండర్ రూ. 15,000 రూపాయల ఫోన్ గా అడుగుపెట్టింది. అయితే, ఈ ఫోన్ పై అందించిన బిగ్ డీల్స్ తో మంచి ఆఫర్ ప్రైస్ లో లభిస్తుంది.

OPPO K14x 5G: ప్రైస్

ఈ ఫోన్ బేసిక్ (4 జీబీ + 128 జీబీ) వేరియంట్ ను కేవలం రూ. 14,999 ధరతో అందించింది. ఈ ఒప్పో హై ఎండ్ వేరియంట్ (4 జీబీ + 128 జీబీ) ను రూ. 16,999 ధరతో అందించింది. ఈ ఒప్పో కొత్త ఫోన్ ప్రిజం వయోలెట్ మరియు ఐసీ బ్లూ రెండు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ ఈరోజు నుంచి ఫ్లిప్ కార్ట్ మరియు ఒప్పో అధికారిక వెబ్సైట్ నుండి సేల్ అవుతోంది.

ఆఫర్స్:

ఒప్పో ఈ ఫోన్ పై మంచి ఆకర్షణీయమైన డీల్స్ అందించింది. ఈ ఫోన్ టోటల్ మూడు ఆఫర్స్ ఒప్పో అందించింది. ఈ ఫోన్ పై రూ. 500 కూపన్ డిస్కౌంట్, రూ. 1,500 కూపన్ అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ మరియు ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI రికార్డు ఆప్షన్ పై రూ. 468 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది.

ఈ మూడు ఆఫర్స్ కలిసి మొత్తంగా ఈ ఫోన్ పై టోటల్ రూ. 2468 రూపాయల తగ్గింపు లభించేలా ఒప్పో అవకాశం అందించింది. ఈ అన్ని ఆఫర్స్ అందుకుంటే ఈ ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 12,531 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది.

Also Read: Google Pixel 10a లాంచ్ కంటే సందర్భంగా పిక్సెల్ 10 ఫోన్ పై భారీ డీల్స్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!

OPPO K14x 5G: ఫీచర్స్

ఈ ఒప్పో న్యూ స్మార్ట్ ఫోన్ HD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.75 ఇంచ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ ఒప్పో ఫోన్ HD గేమింగ్ సపోర్ట్ మరియు మంచి బ్రైట్నెస్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. మీడియాటెక్ Dimensity 6300 ప్రోసెసర్ తో ఈ ఫోన్ పనిచేస్తుంది. జతగా 6 జీబీ ర్యామ్, 6 జీబీ అదనపు ర్యామ్ సపోర్ట్ మరియు 128 జీబీ స్టోరేజ్ తో ఈ ఫోన్ ఉంటుంది. కలర్ OS సాఫ్ట్ వేర్ తో Android 16 OS తో తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది.

ఈ ఒప్పో స్మార్ట్ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా 2MP డెప్త్ కెమెరా ఉంటాయి. ఇవి కాకుండా ఈ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ AI Eraser 2.0 తో సహా లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ తో వస్తుంది. ఒప్పో కె 14x ఫోన్ లో 6500 mAh బిగ్ బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఆఫర్ చేసింది. IP64 రేటింగ్ కలిగి ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ గా ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :