OPPO K12x 5G new color variant first sale starts tomorrow on flipkart sale
OPPO K12x 5G కొత్త కలర్ వేరియంట్ భారీ ఆఫర్ తో రేపు మొదటిసారిగా సేల్ కి వస్తుంది. బడ్జెట్ ధరలో ఒప్పో ఇటీవల విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కొత్త ఫెదర్ పింక్ వేరియంట్ ను మొన్న లాంచ్ చేసింది. రేపటి నుంచి మొదలవనున్న Flipkart ది బిలియన్ డేస్ సేల్ నుంచి ఈ కొత్త వేరియంట్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఫ్లిప్ కార్ట్ BBD సేల్ రేపు ప్లస్ యూజర్లకు మొదలవుతుంది.
ఒప్పో K12x 5G కొత్త పింక్ కలర్ వేరియంట్ కూడా రూ. 12,999 ప్రారంభ ధరకు లభిస్తుంది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ మరింత తక్కువ ధరకు పొందవచ్చు మరియు ఎక్స్ చేంజ్ బోనస్ ను కూడా అందుకునే అవకాశం అందించింది.
Also Read: Nothing Ear (Open): ఓపెన్ బూమ్ సౌండ్ డిజైన్ తో కొత్త బడ్స్ లాంచ్ చేసిన నథింగ్.!
ఒప్పో K12x 5G స్మార్ట్ ఫోన్ మిలటరీ గ్రేడ్ MIL-STD 81H సర్టిఫికేషన్ తో డామేజ్ ప్రూఫ్ బాడీ తో వస్తుంది. ఈ ఫోన్ 6.67 ఇంచ్ HD స్క్రీన్ ను స్ప్లాష్ టచ్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్, 6GB / 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంటుంది.
ఈ ఒప్పో ఫోన్ ల్లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సపోర్ట్ ను కలిగి ఉంటుంది. ఇందులో 32MP మెయిన్ మరియు 2MP పోర్ట్రైట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ లో 5100 mAh బ్యాటరీ మరియు 45W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బడ్జెట్ ధరలో మంచి ఫీచర్స్ కలిగిన ఫోన్ గా యూజర్ల నుంచి కితాబు అందుకుంది.