Oppo K 1 ఇండియాలో ఫిబ్రవరి 6 న విడుదలకానుంది : ఈ ఫోన్ డిస్ప్లేలో ఒక ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది
గత సంవత్సరం చైనాలో విడుదల చేయబడిన ఈ Oppo K1 ఇప్పుడు ఇండియాలో విడుదలకానుంది.
ఇన్ బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సారుతో, గత సంవత్సరం చైనాలో విడుదల చేయబడిన ఈ Oppo K1 ఇప్పుడు ఇండియాలో విడుదలకానుంది. ఫ్లిప్ కార్ట్ ఇప్పుడు ఒక తన వెబ్సైటులో ఒక డెడికేటెడ్ మైక్రోసైట్ తో డ్ని గురించి వివరిస్తోంది. ఇందులో, లేటెస్ట్ టెక్ ఒక అద్భుతమైన ధరలో అదికూడా Oppo హౌస్ నుండి అని చూపిస్తోంది. అంటే, ఇది మిడ్ రేంజ్ ప్రైస్ అవుతుందేమో వేచిచూడాల్సివుంటుంది.
Surveyఇక్కడ ఇచ్చిన డెడికేటెడ్ మైక్రోసైట్ లో, ఒక గుర్తించదగిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఒక నమ్మలేని ధరలో అనికూడా క్యాప్షన్ గా చూపిస్తోంది. అలాగే, ఈ Oppo K1 సామ్రాట్ ఫోన్ను, ఫిబ్రవరి 6 న మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ ఆవిష్కరించనున్నట్లు చెబుతోంది.
Oppo K1 ప్రత్యేకతలు
గత సంవత్సరం చైనాలో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్, 1080 x 2340 రిజల్యూషన్ కలిగిన ఒక 6.4 అంగుళాల డిస్ప్లేతో వచ్చింది. ఇది 2.2GHz వేగంతో క్లాక్ చేయబడిన, ఒక క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 660 ఆక్టా కోర్ ప్రొసెసరుతో వస్తుంది. ఇది చైనాలో 4GB మరియు 6GB వంటి రెండు వేరియంట్లలో విడుదల చేయబడింది. ఇక చైనాలో ధరలను గురించి చూస్తే కనుక, ఈ 4GB వేరియంట్ 1,599 యువాన్ (సుమారు రూ. 16,850) మరియు 6GB వేరియంట్ 1,799 యువాన్ (సుమారు రూ. 19,000) ధరతో వచ్చాయి. అయితే, భారతదేశంలో విడుదలయ్యేప్పుడు వీటి ధరలలో మార్పు వుండవచ్చు.
కెమేరాల విషయానికి వస్తే, వెనుక 16MP కెమేరాకు జతగా మరొక 2MP సెన్సార్ కలిగిన డ్యూయల్ కెమేరాతో ఉంటుంది. ఇక ముందుభాగంలో ఒక 25MP సెల్ఫీ కెమెరాతో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఓరెయో 8.1 తో నడుస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile