OPPO Find X9 Series ఫోన్లను మీడియాటెక్ Dimensity 9500 తో లాంచ్ చేస్తున్న ఒప్పో.!

Updated on 23-Sep-2025
HIGHLIGHTS

OPPO Find X9 Series స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కోసం ఒప్పో టీజింగ్ మొదలుపెట్టింది

లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ Dimensity 9500 తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది

ఈ సిరీస్ ఫోన్లును ముందుగా గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేస్తుంది

OPPO Find X9 Series స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కోసం ఒప్పో టీజింగ్ మొదలుపెట్టింది. ఒప్పో ఈ అప్ కమింగ్ ఫ్లాగ్ షిప్ ఫోన్లను మీడియాటెక్ యొక్క లేటెస్ట్ పవర్ ఫుల్ చిప్ సెట్ Dimensity 9500 తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ సిరీస్ ను ముందుగా గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేయబోతున్నట్లు ఒప్పో కన్ఫర్మ్ చేసింది. ఒప్పో యొక్క అధికారిక x అకౌంట్ నుంచి ఈ ఫోన్ కోసం టీజర్ ఇమేజ్ కూడా రిలీజ్ చేసింది.

OPPO Find X9 Series : లాంచ్

ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 సిరీస్ ఫోన్స్ లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ ఫోన్స్ లాంచ్ కోసం టీజింగ్ మాత్రం ప్రారంభించింది. ఈ సిరీస్ ఫోన్లును ముందుగా గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ యొక్క పెర్ఫార్మన్స్ గురించి కంపెనీ ప్రత్యేకమైన వివరాలు అందించింది.

OPPO Find X9 Series : ఫీచర్స్

ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్ తో లాంచ్ అవుతున్నాయని ఒప్పో తెలిపింది. ఇది బిగ్ కోర్ ఆర్కిటెక్ తో ఉంటుంది మరియు సూపర్ పెర్ఫార్మెన్స్ అందిస్తుందని ఒప్పో ఈ చిప్ సెట్ గురించి గొప్పగా చెబుతోంది. ఇది 4.21GHz అల్ట్రా కోర్, మూడు ప్రీమియం కోర్స్ మరియు నాలుగు పెర్ఫార్మెన్స్ కోర్స్ కలిగి ఉంటుంది. ఇది Arm G1-Ultra GPU తో మరింత స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఒప్పో యొక్క Trinity Engine తో మరింత వేగంగా ఉంటుందట. కేవలం పెర్ఫార్మెన్స్ మాత్రమే కాదు ఓవరాల్ హ్యాండ్లింగ్ మరియు మంచి బ్యాటరీ సేవింగ్ సత్తా కూడా కలిగి ఉంటుంది. ఈ చిప్ సెట్ ను వేగంగా చల్లబరిచే కస్టమైజ్డ్ కూలింగ్ సెటప్ కూడా ఈ ఫోన్స్ లో ఉంటుందని ఒప్పో చెబుతోంది.

Also Read: అమెజాన్ సేల్ నుంచి Sony 5.1ch Dolby Soundbar పై జబర్దస్ డిస్కౌంట్ అందించింది.!

ఈ ఫోన్స్ మంచి గేమింగ్ కోసం మంచి ఫ్రేమ్ రేట్ తో గొప్ప గేమింగ్ ఆఫర్ చేస్తాయని కూడా ఒప్పో తెలిపింది. ఈ ఫోన్స్ కలిగిన కెమెరా వివరాలు కూడా కంపెనీ అందించారు. ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్లు HASSELBLAD కెమెరా సెటప్ కలిగి ఉంటాయని ఒప్పో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ మరిన్ని వివరాలు కూడా త్వరలోనే అందించే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఒప్పో AI సత్తా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ అప్ కమింగ్ ఫోన్ మరిన్ని ఫీచర్లు కూడా త్వరలోనే ఒప్పో అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :