Oppo Find X9 Pro launched with 200MP quad camera setup
Oppo Find X9 Pro స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈరోజు ఒప్పో నిర్వహించిన భారీ లాంచ్ ఈవెంట్ నుంచి ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేశారు. భారీ 200MP క్వాడ్ కెమెరా సెటప్ మరియు మరిన్ని ప్రీమియం ఫీచర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల అయ్యింది. ఈ లేటెస్ట్ ఒప్పో స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.
ఒప్పో సరికొత్తగా విడుదల చేసిన ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 9500 లేటెస్ట్ చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను LPDDR5x 16 జీబీ ర్యామ్ మరియు 512 జీబీ (UFS4.1) ఫాస్ట్ స్టోరేజ్ కలిగిన సింగల్ వేరియంట్ తో విడుదల చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ బిగ్ AMOLED స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 3D అల్ట్రా సోనిక్ ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు గొప్ప బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ HDR 10, డాల్బీ విజన్ మరియు HDR Vivid వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ ను భారీ కెమెరా సెటప్ మరియు Hasselblad టెలీ కన్వర్టర్ సపోర్ట్ తో అందించింది. ఇందులో 200MP (OIS) టెలిఫోటో, 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ మరియు 2MP మోనోక్రోమ్ కెమెరాలు కలిగిన క్వాడ్ రియర్ కెమెరా సపోర్ట్ తో అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ ముందు భాగంలో కూడా 50MP సెల్ఫీ కెమెరా అందించింది. ఈ ఫోన్ 120FPS డాల్బీ విజన్ వీడియో సపోర్ట్ మరియు జబర్దస్త్ ఒప్పో ఫిల్టర్లు మరియు AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ఉన్న సెల్ఫీ కెమెరా కూడా 4K వీడియో సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో 7500 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్, 50W ఎయిర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ మరియు 10W రివర్స్ వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఒప్పో ఈ ఫోన్ లో అందించింది. ఈ ఒప్పో ఫైండ్ X9 ప్రో స్మార్ట్ ఫోన్ కలర్ OS 16 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 OS పై నడుస్తుంది. ఈ ఫోన్ AI సపోర్ట్ తో చాలా తెలివిగా మరియు వేగంగా ఉంటుంది.
Also Read: Sony Bravia 4K స్మార్ట్ టీవీ పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి.!
ఇండియన్ మార్కెట్లో రూ. 1.09,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 ప్రో స్మార్ట్ ఫోన్ ను ఒప్పో లాంచ్ చేసింది. ఈ ఫోన్ సిల్క్ వైట్ మరియు టైటానియం చార్కోల్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం 1 గంటల నుంచి ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ కూడా స్టార్ట్ చేసింది.
ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 ప్రో స్మార్ట్ ఫోన్ పై భారీ లాంచ్ ఆఫర్స్ కూడా ప్రకటించింది. ఈ ఫోన్ పై Axis, HDFC, ICICI, SBI, Kotak మరియు IDFC First బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 10% డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ తో రూ. 10,999 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ రూ. 99,000 ధరలో లభిస్తుంది.