ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో Flip సిరీస్ నుండి OPPO Find N3 Flip ను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ ను నిన్న చైనా మార్కెట్ లో ప్రకటించిన ఒప్పో ఇప్పుడు ఈ ఫోన్ ను ఇండియాలో కూడా లాంచ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ OPPO Find N3 Flip స్మార్ట్ ఫోన్ ను త్వరలో ఇండియాలో విడుదల చేయబోతున్నట్లు ఒప్పో అనౌన్స్ చేసింది. ఒప్పో అనౌన్స్ చేసిన ఈ అప్ కమింగ్ ఫ్లిప్ ఫోన్ ను అద్భుతమైన డిజైన్ మరియు భారీ కెమేరా సెటప్ తో లాంచ్ చెయ్యడానికి సిద్ధమవుతోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు పైన ఒక లుక్కేయండి.
Survey
✅ Thank you for completing the survey!
OPPO Find N3 Flip Teaser
ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ యొక్క వెనుక భారీ కెమేరా సెటప్ తో వస్తోంది. ఒప్పో యొక్క అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ ను పోస్ట్ చేసింది. ఈ ఫోన్ లో ముందుగా వచ్చిన Flip Phone కన్నా చాలా విభిన్నంగా కనిపిస్తోంది. అయితే, ఈ ఫోన్ చైనాలో విడుదలైన అదే ఫోన్ అని ఇప్పటికే చాలా మంది టిప్స్ స్టర్స్ మరియు లీక్ స్టర్స్ ట్విట్టర్ లో తమ తమ అంచనాలను వెల్లడిస్తున్నారు.
OPPO Find N3 Flip చైనా వేరియంట్ భారీ ఫీచర్స్ తో చైనా మార్కెట్ లో అడుగు పెట్టింది. Find N3 Flip స్మార్ట్ ఫోన్ 6.80 ఇంచ్ AMOLED flexible screen మెయిన్ డిస్ప్లేని మరియు బయట 3.26 చిన్న డిస్ప్లేని కలిగి వుంది. ఈ ఫోన్ ట్రిపుల్ మెయిన్ కెమేరా కలిగిన మొదటి ఫోన్ మరియు ఇది Hasselblad భారీ కెమేరా సెటప్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 50MP + 32MP టెలిఫోటో కెమేరా + 48MP అల్ట్రా వైడ్ కెమేరాలను కలిగి వుంది మరియు ముందు 32MP సెల్ఫీ కెమేరాని కూడా కలిగి వుంది. ఈ ఫోన్ తో 4K వీడియోలను 30fps వద్ద చిత్రీకరించవచ్చు.
ఈ ఒప్పో ఫోన్ మీడియాటెక్ Dimensity 9200 ఫాస్ట్ ప్రోసెసర్, 12GB ర్యామ్, 512GB వరకూ ఇంటర్నల్ స్టోరేజ్ వంటి భారీ ఫీచర్ లతో వచ్చింది.
OPPO Find N3 Flip Price (China)
ఒప్పో ఫైండ్ N3 ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ ను ఒప్పో CNY 6799 (సుమారు రూ.77,000) ప్రారంభ ధరలో లాంచ్ చేసింది.
OPPO Find N3 Flip యొక్క ఇండియా లాంచ్ గురించి కంపెనీ అనౌన్స్ చేసింది. కానీ, OPPO Find N3 Flip లాంచ్ డేట్ మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఒప్పో ఇండియా అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి చేసిన ట్వీట్ ఈ క్రింద చూడవచ్చు.