Oppo Fantastic Days Sale నుండి ఒప్పో లేటెస్ట్ 5G ఫోన్ పైన భారీ డీల్స్.!

HIGHLIGHTS

Oppo Fantastic Days Sale నుండి భారీ డీల్స్

ఈ సేల్ నుండి ఒప్పో ఫోన్లను చాలా చవక ధరకే పొందే వీలుంది

ఈ సేల్ నుండి ఒప్పో ఫోన్ల పైన గొప్ప డిస్కౌంట్ అందిస్తోంది

Oppo Fantastic Days Sale నుండి ఒప్పో లేటెస్ట్ 5G ఫోన్ పైన భారీ డీల్స్ ప్రకటించింది. ఈరోజు నుండి మొదలైన ఈ సేల్ నుండి ఒప్పో ఫోన్ల పైన గొప్ప డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లను కూడా అందిస్తోంది. ప్రముఖ ఇ-కార్ట్ కంపెనీ అమెజాన్ తన ప్లాట్ ఫామ్ పైన ప్రకటించిన ఈ సేల్ నుండి ఒప్పో ఫోన్లను చాలా చవక ధరకే పొందే వీలుంది. ఈ సేల్ నవంబర్ 5 నుండి నవంబర్ 9 వ తేదీ వరకూ అమెజాన్ నుండి అందుబాటులో ఉంటుంది. మరి ఈ సేల్ బెస్ట్ ఒప్పో 5G ఫోన్ అఫర్ గురించి చూద్దామా.

OPPO A74 5G: ధర మరియు ఆఫర్లు

ఒప్పో A74 5G లాంచ్ సమయంలో రూ.17,990 రూపాయల ధరతో వచ్చింది. అయితే, Oppo Fantastic Days Sale నుండి ఈ ఫోన్ 3,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.14,990 డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అమెజాన్ నుండి నిర్వహిస్తున్న ఈ సేల్ నుండి ICICI బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

OPPO A74 5G: స్పెక్స్

OPPO A74 5G ఫోన్ 2400x1080p రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల FHD + పంచ్-హోల్ డిస్ప్లేని ప్యాక్ చేస్తుంది. అయితే, ఈ డిస్ప్లే యొక్క గుర్తించదగిన ఫీచర్లలో ఒకటి ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz యొక్క టచ్ శాంప్లింగ్ రేటును అందిస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 5G ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 6GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. 

ఒప్పో A74 5G ట్రిపుల్ రియర్ సెటప్‌ తో వస్తుంది. ఇందులో 48MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాటింగ్ కోసం, ఈ ఫోన్ 8MP సెల్ఫీ యూనిట్‌తో వస్తుంది.  ఈ ఒప్పో ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 18W ఫ్లాష్ ఛార్జింగ్‌ తో కలిగివుంది మరియు ఇది 60 నిమిషాల్లో బ్యాటరీని 68% ఛార్జ్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :