OPPO F31 5G Series price and features know here
OPPO F31 5G Series ఈరోజు ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ నుని మూడు ఫోన్లు లాంచ్ చేసింది. ఇందులో, ఒప్పో ఎఫ్ 31 5జి, ఒప్పో ఎఫ్ 31 ప్రో 5జి మరియు ఒప్పో ఎఫ్ 31 ప్రో ప్లస్ 5జి మూడు ఫోన్లు ఉన్నాయి. ఈ మూడు ఫోన్స్ కూడా ఈరోజు నుంచి ప్రీ ఆర్డర్ కి అందుబాటులోకి కూడా వచ్చాయి. ఒప్పో సరికొత్తగా విడుదల చేసిన ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ తెలుసుకోండి.
ఒప్పొ సిరీస్ నుంచి అందించిన మూడు స్మార్ట్ ఫోన్ల ధరలు ఇప్పుడు చూద్దాం. ఒప్పో ఎఫ్ 31 5జి ఫోన్ ను రూ. 22,999 స్టార్టింగ్ ప్రైస్ తో, ఒప్పో ఎఫ్ 31 ప్రో 5జి ఫోన్ ను రూ. 26,999 స్టార్టింగ్ ప్రైస్ తో మరియు ఒప్పో ఎఫ్ 31 ప్రో ప్లస్ 5జి ఫోన్ ను రూ. 32,999 స్టార్టింగ్ ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ మూడు కొత్త స్మార్ట్ ఫోన్ల Pre-Orders కూడా ఈరోజు నుంచి ప్రారంభించింది. ఈ ఫోన్లు సెప్టెంబర్ 19వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఈ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది. ఈ ఫోన్లు Flipkart, Amazon మరియు Oppo అఫీషియల్ వెబ్సైట్ నుంచి సేల్ అవుతుంది.
ఒప్పో ఈ మూడు స్మార్ట్ ఫోన్లను సరికొత్త డిజైన్ తో అందించింది. ఇందులో ఒప్పో ఎఫ్ 31 ప్రో ప్లస్ 5జి ఫోన్ ను 6.8 ఇంచ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ చేసింది. అయితే, ఒప్పో ఎఫ్ 31 ప్రో మరియు ఒప్పో ఎఫ్ 31 రెండు ఫోన్లను 6.5 ఇంచ్ AMOELD స్క్రీన్ తో అందించింది. ఈ మూడు ఫోన్లు కూడా 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటాయి. ఈ మూడు ఫోన్లు కూడా ఏరో స్పేస్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ మరియు మిలిటరీ గ్రేడ్ షాక్ ప్రూఫ్ తో పాటు IP66, IP68 మరియు IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కలిగి ఉంటాయి.
కెమెరా పరంగా, ఈ మూడు ఫోన్లు కూడా వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటాయి. వీటిలో 50MP (OmniVision) మెయిన్ కెమెరా జతగా 2MP మోనోక్రోమ్ సెన్సార్లు ఉంటాయి. అయితే, సెల్ఫీ పరంగా మార్పులు ఉంటాయి. వీటిలో, F31 ప్రో ప్లస్ ఫోన్ 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటే, F31 ప్రో మరియు F31 ప్రో 5జి ఫోన్లు 16MP Sony సెల్ఫీ కెమెరా కలిగి ఉంటాయి.
Also Read: రూ. 6750 ధరకే వచ్చిన 4K Camera తో వచ్చిన Lava Bold N1 5G ఫోన్ సేల్ మొదలయ్యింది.!
ఈ మూడు ఫోన్ల చిప్ సెట్స్ లో కూడా మార్పులు ఉంటాయి. వీటిలో ఒప్పో ఎఫ్ 31 ప్రో ప్లస్ ఫోన్ Snapdragon 7 Gen 3 చిప్ సెట్ కలిగి ఉంటే, ఎఫ్ 31 ప్రో Dimensity 7300 – Energy కలిగి ఉంటుంది. అయితే, బేసిక్ ఫోన్ ఒప్పో ఎఫ్ 31 5జి మాత్రం Dimensity 6300 చిప్ సెట్ తో అందించింది. ఈ మూడు ఫోన్లు కూడా 7000mAh బిగ్ బ్యాటరీ మరియు 80W SUPER VOOC ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటాయి.