OPPO F27 Pro plus now available with rs 11000 huge discount
OPPO F27 Pro+ స్మార్ట్ ఫోన్ ఎన్నడూ చూడనంత చవక ధరలో ఈరోజు లభిస్తుంది. ఆకట్టుకునే ఫీచర్స్ మరియు డిజైన్ వచ్చిన ఈ F27 సిరీస్ ప్రీమియం ఫోన్ ఇప్పుడు రూ. 11,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం 16 వేల రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ ఫోన్ ప్రీమియం ఫీచర్స్ తో డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ డీల్ వివరాలు మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ (8GB + 128GB) ఇండియాలో రూ. 27,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో ఎన్నడూ చూడనంత చవక ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ బెస్ట్ ప్రైస్ కు ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తుంది. ఎందుకంటే, ఈ ఫోన్ పై రూ. 9,850 రూపాయల భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 18,149 రూపాయల అతి తక్కువ ధరకే ఫ్లిప్ కార్ట్ సేల్ చేస్తోంది.
పైన తెలిపిన భారీ డిస్కౌంట్ కాకుండా ఈ ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఫోన్ ను HDFC Bank క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1250 రూపాయల అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 16,899 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఈ ఫోన్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్ గా నిలుస్తుంది.
Also Read: GIF Sale 2025 కంటే ముందే భారీ 5.2 Dolby Soundbar డీల్ అనౌన్స్ చేసిన అమెజాన్.!
ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ ప్రీమియం డిజైన్ మరియు ప్రీమియం లెథర్ బ్యాక్ తో వస్తుంది. చూడగానే ఆకట్టుకునే గొప్ప డిజైన్ తో ఈ ఫోన్ ను ఒప్పో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో కూడా ఉంటుంది. ఈ ఫోన్ 6.7 ఇంచ్ 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ ను ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు FHD + రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 గ్లాస్ తో చాలా పటిష్టంగా ఉంటుంది.
ఈ ఒప్పో స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7050 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 64MP మెయిన్ కెమెరాకి జతగా 2MP సెకండరీ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 30 FPS తో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్, స్లో మోషన్, డ్యూయల్ వీడియో మరియు మంచి ఫోటో ఫిల్టర్లు కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీ మరియు 67W SUPER VOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.