Oppo F25 Pro 5G launching with stunning camera setup 1
Oppo F25 Pro 5G: ఒప్పో నుండి మరొక కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్ లో విడుదల కాబోతోంది. ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి టెంప్టింగ్ ఇమేజ్ లతో టీజింగ్ కూడా మొదలు పెట్టింది. ఒప్పో తీసుకు రాబోతున్న ఒప్పో ఎఫ్25 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ గురించే మనం ఇప్పుడు చెప్పుకుంటోంది. ఈ అప్ కమింగ్ ఒప్పో స్మార్ట్ ఫోన్ విశేషాలు ఏమిటో ఒక్కసారి చూసొద్దామా.
ఒప్పో ఎఫ్25 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో February 29 న విడుదల చేస్తునట్లు ఒప్పో కన్ఫర్మ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం Flipkart ఆన్లైన్ సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తుంది. అందుకే, ఈ ఒప్పో అప్ కమింగ్ స్మార్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను అందించింది మరియు ఈ పేజ్ నుండి కీలకమైన స్పెక్స్ తో టీజింగ్ కూడా మొదలు పెట్టింది.
Also Read: Samsung Smart Tv: లేటెస్ట్ శామ్సంగ్ స్మార్ట్ టీవీ పైన ధమాకా ఆఫర్.!
ఒప్పో ఎఫ్25 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ తో ఇప్పటికే కంపెనీ టీజర్ లను అందించింది. ఈ టీజర్ ఇమేజ్ ల ద్వారా ఈ ఫోన్ చాలా సన్నని మరియు అందమైన డిజైన్ తో వస్తున్నట్లు అర్ధమవుతోంది. ఈ ఫోన్ యొక్క కెమేరా వివరాలను కంపెనీ అందించింది.ఎఫ్25 ప్రో 5జి ఫోన్ లో వెనుక LED ఫ్లాష్ సపోర్ట్ కలిగిన ట్రిపుల్ కెమేరా సెటప్ ను కలిగి ఉంది.
ఈ ఎఫ్25 ప్రో 5జి ఫోన్ లో వెనుక 64MP అల్ట్రా క్లియర్ మెయిన్ సెన్సార్ + 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ + 2MP మ్యాక్రో సెన్సార్ కలిగిన ట్రిపుల్ కెమేరా సెటప్ వుంది. అంతేకాదు, ఈ ఫోన్ ముందు భాగంలో 32MP (SonyIMX 695) అల్ట్రా క్లియర్ సెల్ఫీ కెమేరా కూడా ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ యొక్క కెమేరాతో 4K అల్ట్రా క్లియర్ వీడియోలను చిత్రీకరించ వచ్చని ఒప్పో టీజింగ్ చేస్తోంది.
ఈ ఒప్పో ఫోన్ లో పంచ్ హోల్ డిజైన్ కలిగిన డిస్ప్లే వుంది మరియు ఈ డిస్ప్లే సన్నని అంచులతో స్టైలిష్ గా కనిపిస్తోంది. ఈ ఫోన్ లాంఛ్ కంటే ముందుగానే మరికొన్ని కీలకమైన స్పెక్స్ ను కూడా టీజర్ ద్వారా ఒప్పో వెల్లడించే అవకాశం వుంది.