Oppo F23 5G: భారీ ఆఫర్లతో సేల్ అవుతున్న ఒప్పో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్.!

HIGHLIGHTS

Oppo F23 5G భారీ ఆఫర్లతో సేల్ అవుతోంది

ఆఫర్లతో ఈ ఫోన్ ను తక్కువ ధరకే అందుకునే అవకాశం ఒప్పో అందించింది

ఈ ఫోన్ 4 సంవత్సరాలు ల్యాగ్ ఫ్రీ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని కంపెనీ గొప్పగా చెబుతోంది

Oppo F23 5G: భారీ ఆఫర్లతో సేల్ అవుతున్న ఒప్పో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్.!

ఒప్పో ఇండియాలో విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Oppo F23 5G భారీ ఆఫర్లతో సేల్ అవుతోంది. ఈ లేటెస్ట్ ఒప్పో స్మార్ట్ ఫోన్ పైన అందించిన బ్యాంక్ మరియు ఎక్స్ ఛేంజ్ ఆఫర్లతో ఈ ఫోన్ ను తక్కువ ధరకే అందుకునే అవకాశం ఒప్పో అందించింది. ఈ ఫోన్ 4 సంవత్సరాలు ల్యాగ్ ఫ్రీ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని కంపెనీ గొప్పగా చెబుతోంది. మరి ఒప్పో ఇంత గొప్పగా చెబుతున్న Oppo F23 5G ధర, ఆఫర్లు మరియు ప్రత్యేకతలు పైన ఒక లుక్కేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Oppo F23 5G: ధర & ఆఫర్స్ 

Oppo F23 5G స్మార్ట్ ఫోన్ ను 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ కలిగిన సింగిల్ వేరియంట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర  రూ. 24,999 రూపాయలు మరియు ఈ ఫోన్ ను బ్యాంక్ మరియు ఎక్స్ ఛేంజ్ ఆఫర్లతో జత చెయ్యడం ద్వారా తక్కువ ధరకు అందుకునే అవకాశం కూడా  అందించింది. 

ICICI మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ తో ఒప్పో F23 5G ఫోన్ ను కొనే కస్టమర్లకు రూ. 2,500 భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, ఎక్స్ ఛేంజ్ అఫర్ తో ఈ ఫోన్ వారికి రూ. 2,500 వరకూ ఎక్స్ ట్రా డిస్కౌంట్ ను కూడా అఫర్ చేస్తోంది. ఈ రెండు ఆఫర్ల ద్వారా ఈ ఫోన్ రూ. 5,000 వరకూ తగ్గింపుతో కొనే వీలుంటుంది.

ఈ ఫోన్ ను ఒప్పో ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ స్టోర్స్ నుండి మరియు Amazon నుండి కూడా కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ నుండి బ్యాంక్ ఆఫర్లతో కొనుగోలు చేయడానికి Buy From Here పైన నొక్కండి.       

Oppo F23 5G: ప్రత్యేకతలు 

ఒప్పో F23 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగిన 6.72 ఇంచ్ FHD+ LTPS LCD డిస్ప్లేని కలిగి వుంది. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 695 ఆక్టా కోర్ 5G ప్రోసెసర్ మరియు 8GB తో పాటుగా 8GB వరకూ RAM Expansion ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 256 GB హెవీ స్టోరేజ్ ను UFS 2.2 ఫాస్ట్ స్టోరేజ్ తో జత చేసింది. 

ఈ ఒప్పో 5G ఫోన్ లో 64MP మైన్ కెమేరా + 2MP మోనో + 2MP మైక్రోస్కోప్ సెన్సార్ తో ట్రిపుల్ కెమేరాని అందించింది మరియు ముందు 5P లెన్స్ తో 32MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఒప్పో F23 5G ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీని 67W సూపర్ ఉక్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్  తో కలిగి వుంది. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo