ఒప్పో తన ఒప్పో F19 స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 6 న విడుదల చేస్తోంది. ఇప్పటికే ఒప్పో F19 సిరీస్ నుండి ఒప్పో F19 ప్రో మరియు ఒప్పో F19 ప్రో ప్లస్ లను విడుదల చేసింది. ఇప్పుడు, ఈ ఒప్పో F19 సిరీస్ నుండి ఒప్పో F19 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. ఈ సిరీస్ నుండి ముందుగా విడుదల చేసిన ఫోన్ల మాదిరిగానే ఈ ఫోన్ ను కూడా పెద్ద బ్యాటరీతో వున్నా కూడా చాలా స్లిమ్ డిజైన్ తో తీసుకొస్తున్నట్లు చెబుతోంది.
ఒప్పో సంస్థ, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ ఈవెంట్ కి సంబంధించి ఆహ్వానాలను పంపించింది. ఒప్పో యొక్క షోషల్ మీడియా ఛానల్స్ ద్వారా ఈ కార్యక్రమం లైవ్ ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం ఏప్రిల్ 6 న మధ్యాహ్నం 12 గంటలకి ప్రసారం అవుతుంది.
ఈ ఫోన్ స్పెక్స్ గురించి కంపెనీ పూర్తిగా వెల్లడించలేదు. ఈ ఫోన్ లో FHD+ AMOLED మరియు 6,000 mAh బ్యాటరీ ఉన్నట్లు వెల్లడించింది. అలాగే, ఈ ఫోన్ 33W ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ తో కూడా ఉన్నట్లు తెలిపింది. ఆయితే, కొన్ని ఇతర వివరాలు అమెజాన్ ద్వారా చేసిన లిస్టింగ్ ద్వారా తెలిశాయి. అమెజాన్ లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ లో పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా డిజైన్ వుంది.