Oppo Bumper Offer: భారీగా ధర తగ్గిన…. Oppo Reno 3 Pro

Updated on 15-Aug-2020

Oppo Reno 3 Pro ఇండియాలో భారీ 44MP డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో తీసుకురాబడిన మొదటి స్మార్ట్ ఫోన్. అంతేకాదు, ఈ Oppo Reno 3 Pro వెనుక కూడా 64MP క్వాడ్ కెమేరా సెటప్ ను 20X క్లియర్ జూమ్ తో పాటుగా అందిస్తుంది. ఆడియో పరంగా కూడా Hi-Res Audio మరియు Dolby Atmos వంటి అద్భుతమైన ప్రత్యేకతలతో ఒప్పో తీసుకొచ్చిన ఈ ఫోన్ పైన ధరలో ఇప్పుడు 3,000 రుపాయల భారీ తగ్గింపును ప్రకటించింది మరియు ఆల్ టైం తక్కువ ధరకు అమ్మడుచేస్తోంది.          

Oppo Reno 3 Pro Latest Price

ఈ ఒప్పో రెనో 3 ప్రో కేవలం 8GB ర్యామ్ ఎంపికతో మాత్రమే విడుదల చెయ్యబడింది మరియు ఇది రేడు స్టోరేజి ఎంపికలతో ప్రకటించబడింది.

1. Oppo Reno 3 Pro (8GB +  128GB ) – ధర : Rs. 27,990

2. Oppo Reno 3 Pro (8GB +  256GB ) – ధర : Rs. 29,990

Oppo Reno 3 Pro: ప్రత్యేకతలు

Oppo Reno 3 Pro స్మార్ట్ ఫోన్ ఒక మిడ్-రేంజ్ హ్యాండ్‌సెట్ గా ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇది గరిష్టంగా 2.2 GHz వరకూ క్లాక్ స్పీడ్ అందించగల సరికొత్త  మీడియా టెక్ హీలియో P95 SoC యొక్క శక్తిని కలిగి ఉంది. ఇది వేగవంతమైన ప్రాసెసర్ కాబట్టి, స్మార్ట్ ఫోన్ చాలా వేగంగా మరియు స్మూత్ గా పనిచేస్తుంది.

Oppo Reno 3 Pro: Display

ఇక స్క్రీన్ విషయానికి వస్తే, ఒక 6.4-అంగుళాల Full HD + Super AMOLED డిస్ప్లేని 91.5 శాతం స్క్రీన్ టూ బాడీ నిష్పత్తితో కలిగి ఉంది. ఈ డిస్ప్లేలో డ్యూయల్ సెల్ఫీ కోసం కొంచెం పెద్దదైన పంచ్ హోల్ నోచ్ డిజైన్ ఉంది, ఇందులో డ్యూయల్ సెల్ఫీ కెమెరా ఉంచబడుతుంది మరియు వేగవంతమైన ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, వెనుక ఒక ప్రత్యేకమైన గ్లాస్ డిజైన్ కలిగి ఉంది, అరోరల్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్ మరియు స్కై వైట్ కలర్ వంటి అందమైన కలర్ ఎంపికలతో వస్తుంది.

Oppo Reno 3 Pro: Camera

ఆప్టిక్స్ పరంగా, ఒప్పో రెనో 3 ప్రో వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ తో ఉంటుంది. ఇది 5X ఆప్టిక్ జూమ్ లేదా 20X హైబ్రిడ్ జూమ్ చెయ్యగల f / 2.4 ఎపర్చరు కలిగిన ఒక 13MP లెన్స్ కి జతగా f/1.8 ఎపర్చర్ గల 64MP ప్రధాన సెన్సార్, దీనికి జతగా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు చివరిగా f / 2.4 మాక్రో లెన్స్‌తో 2MP కెమెరా కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్, చీకట్లో కూడా మెరుగైన Low -Light చిత్రాలను కూడా అందిస్తుంది. ముందు భాగంలో మొట్ట మొదటి సారిగా ఒక ప్రధాన  44MP సెన్సార్ గల డ్యూయల్ సెల్ఫీ కెమెరాని అందించిన ఘనత ఒప్పో కి మాత్రమే దక్కుతుంది. ఇందులో ఒక 2MP డెప్త్ సెనర్ కూడా జతగా వుంటుంది.

Oppo Reno 3 Pro: Performance & Battery

Oppo Reno 3 Pro గరిష్టంగా 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌ సెట్‌ లో హైపర్‌ బూస్ట్ అమర్చారు, ఇది గేమింగ్ ఆడేటప్పుడు మరింత మధురానుభూతిని అందిస్తుంది. అలాగే, ఒక 4025mAh బ్యాటరీతో మద్దతు ఉన్నఈ హ్యాండ్‌ సెట్ టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉంది మరియు 30 వాట్స్  VOOC 4.0 ఛార్జింగ్‌ కు మద్దతు ఇస్తుంది. ఈ VOOC ఛార్జింగ్ 20 నిమిషాల్లో హ్యాండ్‌సెట్ బ్యాటరీని 50 శాతం నింపుతుంది.   

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :