ఈ మూడు ఫోన్ల పైన భారీ తగ్గింపు ప్రకటించిన OPPO..!

HIGHLIGHTS

OPPO యొక్క కొత్త ఫోన్ కొనాలని చూస్తున్న వారికి శుభవార్త

మూడు కొత్త స్మార్ట్ ఫోన్ల పైన భారీ తగ్గింపును ప్రకటించింది

ఈ మూడు ఫోన్లను కూడా మరింత చవక ధరకే మీరు పొందవచ్చు

OPPO యొక్క కొత్త ఫోన్ కొనాలని చూస్తున్న వారికి శుభవార్త. ఒప్పో ఇటీవల ఇండియాలో విడుదల చేసిన మూడు కొత్త స్మార్ట్ ఫోన్ల పైన భారీ తగ్గింపును ప్రకటించింది. అంటే, ఈ మూడు ఫోన్లను కూడా మరింత చవక ధరకే మీరు పొందవచ్చు. OPPO F21 Pro, OPPO A55 మరియు OPPO A77 మూడు స్మార్ట్ ఫోన్ల పైన ఒప్పో ఈ ప్రైస్ కట్ ను అందించింది. కంపెనీ యొక్క అధికారిక వెబ్ సైట్ నుండి తగ్గింపు ధరలతో ఈ మూడు స్మార్ట్ ఫోన్లను లిస్టింగ్ చేసింది.

రూ. 22,999కి విక్రయించబడిన OPPO F21 Pro యొక్క 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్, ఇప్పుడు రూ. 1,000 ధర తగ్గింపు అందుకొని రూ.21,999 ధరకు లభిస్తోంది. అలాగే, OPPO A55 యొక్క 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు రూ. 14,499 ధరకు అందుబాటులో ఉంది. మరోవైపు, ఈ ఫోన్ యొక్క 6GB RAM వేరియంట్ ఇప్పుడు రూ. 14,999 కి లభిస్తోంది. ఇక చివరిగా మూడవ ఫోన్ అయిన OPPO A77 విషయానికి వస్తే, ఈ ఫోన్ యొక్క 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ఇప్పుడు రూ. 15,999కి అందుబాటులో ఉంది.

OPPO F21 Pro: స్పెక్స్

ఒప్పో ఎఫ్21 ప్రో పంచ్ హోల్ డిజైన్ కలిగిన 6.43 ఇంచ్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో కలిగివుంటుంది. F12 Pro డిస్ప్లేలో అందించిన పంచ్ హోల్ కటౌట్ లో 32 ఎంపి సెల్ఫీ కెమెరాని కలిగి కలిగివుంటుంది. Oppo F21 Pro లేటెస్ట్ 6nm ప్రోసెసర్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రోసెసర్ కలిగివుంది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో పనిచేస్తుంది.

ఇక కెమెరా విషయానికి వస్తే, వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 64MP మైన్ కెమెరాకి జతగా 2ఎంపి డెప్త్ సెన్సార్ మరియు 2ఎంపి మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా ColorOS 12.1 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తాయి. ఈ ఒప్పో స్మార్ట్ ఫోన్ లో 33W SuperVOOC ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బిగ్ బ్యాటరీ కూడా వుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :