8GB+8GB ర్యామ్ టెక్ తో వచ్చిన ఒప్పో కొత్త ఫోన్ గురించి తెలుసుకోండి.!

HIGHLIGHTS

ఒప్పో ఇండియాలో OPPO A78 5G స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది

re-Orders కి అందుబాటులోకి వచ్చిన ఒప్పో ఎ78 5జి

ఈ ఫోన్ 8GB RAM కి జతగా 8GB వరకూ ర్యామ్ ఎక్స్ ప్యాండ్ ఫీచర్ ని కూడా అందించింది

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఒప్పో ఇండియాలో OPPO A78 5G స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను కొత్త డిజైన్, 5G ప్రొసెసర్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ వంటి మరిన్ని ప్రత్యేకతలతో ఇండియన్ మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం Pre-Orders కి అందుబాటులోకి వచ్చిన ఒప్పో ఎ78 5జి స్మార్ట్ ఫోన్ యొక్క ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.

OPPO A78 5G: స్పెక్స్

ఈ ఒప్పో ఎ78 5జి స్మార్ట్ ఫోన్ సన్నని మరియు వెనుక విలక్షణమైన కెమెరా డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ పెద్ద 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ LCD స్క్రీన్ ను 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ 5G ప్రోసెసర్ Dimensity 700 చిప్ సెట్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 8GB RAM కి జతగా 8GB వరకూ ర్యామ్ ఎక్స్ ప్యాండ్ ఫీచర్ ని కూడా అందించింది. ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది మరియు Color OS సాఫ్ట్ వేర్ తో Android 13 OS పైన రన్ అవుతుంది. 

ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ వుంది. ఈ సెటప్ లో, 50MP ప్రధాన కెమేరాకి జతగా మరొక కెమేరా ఉంటుంది. ఈ ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ 5000mAh బిగ్ బ్యాటరీని 33W SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగివుంది. ఈ ఫోన్ లో మంచి సౌండ్ కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా కలిగివుంది. 

OPPO A78 5G: ధర

OPPO A78 5G: స్మార్ట్ ఫోన్ ను (8GB+128GB) సింగిల్ వేరియంట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ.18,999 మరియు ఈ ఫోన్ Pre-Orders కూడా మొదలుపెట్టింది.  ఈ ఫోన్ జనవరి 18 నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.  ఈ ఫోన్ ను SBI బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి 10% డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, Exchange మరియు No cost EMI ఆఫర్లు కూడా అంధుబాటులో ఉన్నాయి. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :