Oppo A57 ఈరోజు ఇండియాలో విడుదల చెయ్యబడింది. ఒప్పో సరికొత్తగా తీసుకువచ్చిన ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ బిగ్ బ్యాటరీ, గేమింగ్ ప్రాసెసర్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి వుంది. అంతేకాదు, దుమ్ము మరియు వాటర్ రెసిస్టెంట్ గల IP54 రేటింగ్ తో అందించడం గమనార్హం. ఇంకెందుకు ఆలశ్యం ఒప్పో ఇండియాలో సరికొత్తగా విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Oppo A57 విశేషాలు ఏమిటో చూసేద్దామా.
ఒప్పో ఎ57 స్మార్ట్ ఫోన్ యొక్క ప్రస్తుతం విక్రయిస్తున్న 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ కలిగిన వేరియంట్ తో లభిస్తుంది మరియు దీని ధర రూ.13,999. Oppo A57 అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మరియు ఒప్పో ఇండియా స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఈఫోన్ గ్లోయింగ్ గ్రీన్ మరియు గ్లోయింగ్ బ్లాక్ అనే రెండు కలర్ అప్షన్లలో లభిస్తుంది.
ఒప్పో ఎ57 స్మార్ట్ ఫోన్ HD+ రిజల్యూషన్ అందించగల 6.56 ఇంచ్ డిస్ప్లేని కలిగి వుంది మరియు ఇది వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో వస్తుంది. ఈ ఒప్పో బడ్జెట్ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ గేమింగ్ ప్రాసెసర్ Helio G35 తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ కి జతగా 3/4GB ర్యామ్ మరియు 6GB స్టోరేజ్ తో వస్తుంది. ఫోన్ IPX4 వాటర్ రెసిస్టెంట్ మరియు IP5X డస్ట్ రెసిస్టెంట్ తో కూడా వస్తుంది. అదనపు రక్షణ కోసం డిస్ప్లే ముందు భాగం పాండా గ్లాస్‌తో కప్పబడి ఉంటుంది.
ఇక కెమెరాల పరంగా, ఈ ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ ను LED ఫ్లాష్ తో కలిగి వుంది. ఇందులో, 13MP ప్రధాన కెమెరాకి జతగా 2MP మోనో కెమెరాని అందించింది. అలాగే, సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ వేగవంతంగా ఛార్జ్ చెయ్యగల సత్తా కలిగిన 33W SuperVOOC సపోర్ట్ కలిగిన 5,000mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా అందించినట్లు ఒప్పో తెలిపింది.