చవక ధరకే కొత్త OPPO 5G స్మార్ట్ ఫోన్ లాంచ్

Updated on 27-Apr-2021
HIGHLIGHTS

చవక ధరకే లేటెస్ట్ OPPO 5G స్మార్ట్ ఫోన్

తక్కువ ధరకే డ్యూయల్ 5G ఫోన్

భారతదేశంలో 5G స్మార్ట్ ఫోన్స్ చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. అందుకే, ఒప్పో సంస్థ దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలా చవక ధరకే లేటెస్ట్ OPPO 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈరోజు ఇండియాలో తన OPPO A53s 5G స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.14,990 రూపాయల ధరకే ప్రకటించి, తక్కువ ధరకే డ్యూయల్ 5G ఫోన్ ను ప్రకటించిన సంస్థగా నిలిచింది. ఈ ఫీచర్లు మరియు ధర వివరాలను ఈ క్రింద చూడవచ్చు.                     

OPPO A53s 5G :

ఈ OPPO A53s 5G ఫోన్ 6.52 అంగుళాల పరిమాణంతో 1600×720 పిక్సెల్స్ రిజల్యూషన్ తో HD+ డిస్ప్లేతో ఉంటుంది. ఈ డిస్ప్లే యొక్క అధనపు ఫీచర్ల గురించి చూస్తే, ఇది 60Hz రిఫ్రెష్ రేటుతో వస్తుంది. అల్ట్రా క్లియర్ ఐ కేర్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ మంచి 5G పర్ఫార్మెన్స్ అందించగల, మీడియాటెక్ యొక్క లేటెస్ట్  ప్రొసెసర్ Dimensity 700 5G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది 7nm ప్రొడక్షన్ ప్రొసెసర్ తో గరిష్టంగా 2.2GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది. ఇందులో ఉన్న ARM Mali-G57 GPU కారణంగా గ్రాఫిక్స్ కూడా బాగుంటాయి.

ఈ ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్ ఎంపికలతో ప్రకటించింది. అవి : 6GB ర్యామ్ + 128GB స్టోరేజి మరియు  8GB ర్యామ్ +128GB స్టోరేజి వంటి రెండు వేరియంట్లు . వీటి ధరలు ఈ క్రింద చూడవచ్చు.

OPPO A53s 5G : ధరలు

1. OPPO A53s 5G : 6GB ర్యామ్ + 128GB స్టోరేజి : Rs.14,990/-

2. OPPO A53s 5G : 8GB ర్యామ్ + 128GB స్టోరేజి : Rs.16,990/-

ఇక OPPO A53s 5G ఫోన్ యొక్క కెమేరాల విషయానికి వస్తే, వెనుక 13MP ట్రిపుల్ కెమెరా సెటప్పును కలిగివుంది. ఈ ట్రిపుల్ కెమెరాలో, f/2.2 ఎపర్చర్ కలిగిన ఒక 13MP ప్రధాన కెమెరాని, రెండవ కెమేరాగా 2MP బొకే కెమెరా మరియు 2MP మ్యాక్రో సెన్సార్ ని అందించింది. ముందు ఒక 8MP సెల్ఫీ కెమెరాతో వుంటుంది. ఈ OPPO A53s 5G ఒక  పెద్ద 5,000mAh బ్యాటరీతో వుంటుంది మరియు సెక్యూరిటీ పరంగా సైడ్ ఫింగర్ ప్రింట్ తో వస్తుంది.  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :